హెల్త్ టిప్స్

సిక్స్ ప్యాక్ దేహం కావాల‌ని ట్రై చేస్తున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

సిక్స్ ప్యాక్ యాబ్…..నేటి యువతకు క్రేజ్. కాని అందుకోసం ఎంతో శ్రమపడాలి. ముందుగా బానపొట్టను కరిగించేయాలి. పొట్టకు మాత్రమే వ్యాయామమంటే చాలదు. వ్యాయామానికి తగ్గ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. పొట్టలో ఆరు కండలను పొందటానికి వ్యాయామాలతోపాటు అవసరమైన ఆహారమేమిటో చూద్దాం! ప్రాసెస్డు, ఫాస్టు ఫుడ్లు వదిలేసి సంపూర్ణ, సహజ ఆహారాన్ని తీసుకోండి. 2. మీ ఆహారంలో ప్రొటీన్లు చేర్చండి. ఇవి కేలరీలు ఖర్చు చేయటమే కాక, ఎనర్జీ ఇస్తాయి. వెజిటబుల్స్ లో పింటో బీన్స్, బ్లాక్ బీన్స్, నేవీ బీన్స్, సోయాబీన్స్, చేర్చండి. బీన్స్ లో కొవ్వు తక్కువగా వుండి పీచు వుంటుంది.

పచ్చని ఆకు కూరలైన గోంగూర, బచ్చలి, పాలకూర, కేబేజి మొదలైనవి ఆహారంలో చేర్చండి. వీటిలోరకరకాల విటమిన్లు, మినరల్స్ అనేకం వుంటాయి. పచ్చటి కూరలలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ ను కూడా నయం చేస్తాయి. ఆహారంలో చేప, చికెన్ మాంసం వుండేలా చూడండి. చక్కటి పొట్ట కండరాలు కావాలనుకునేవారికి కొవ్వు తక్కువ, విటమిన్స్, మినరల్స్ అధికంగా వుండే టర్కీ మాంసం చేర్చండి. శుద్ధి చేయబడిన మాంసం, పంది, దున్న, మొదలగువాటిది తినకండి. కండలను పెంచే మాంసం తినండి. కొవ్వు తక్కువగా వుండే పాల ఉత్పత్తులైన వెన్నతీసిన పాలు, కోడిగుడ్డు, కాటేజ్ ఛీజ్ మొదలైన ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వాడండి.

if you are trying to get six pack body then do like this

ప్రతి దినం ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోండి. లేదంటే, తాగే వాటిలో ప్రొటీన్ పౌడర్ కలుపుకోండి. సిక్స్ ప్యాక్ పొట్టకు కావలసిన ఆహారంలో పప్పులు, పీనట్ బటర్ అత్యవసరం. ఉప్పు కలపని కాయ ధాన్యాలు బాదం పప్పులవంటివి ఆకలిని అదుపు చేయటమే కాదు, గుండె ఆరోగ్యానికి, కండరాల వృధ్ధికవసరమైన ప్రొటీన్లను సమకూరుస్తాయి. ఆపిల్, బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రా బెర్రీ మొదలైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న పండ్లు, కంటి చూపును, జ్ఞాపక శక్తిని వృద్ధి చేసే ఫ్లేవనాయిడ్లను కూడా తీసుకోవాలి. బరువు తగ్గి ఆకర్షణీయమైన సిక్స్ ప్యాక్ పొట్ట రావాలంటే ఈ ఆహార ప్రణాళిక అమలు చేయండి.

Admin

Recent Posts