హెల్త్ టిప్స్

ఏం చేసినా మెడ నొప్పి త‌గ్గ‌డం లేదా..? ఇలా చేయండి.. దెబ్బ‌కు రిలీఫ్ ల‌భిస్తుంది..!

మెడ బెణుకు నొప్పి, మీ కాలి నొప్పి లేదా ఎముక విరగటం వంటిది కాదు. ఈ నొప్పి వస్తే బాధితులు వారేం చేస్తారో వారికే తెలియని స్ధితిలో వుంటారు. సత్వర నివారణ మాత్రమే వారిని మరోమారు పూర్వ స్ధితికి తీసుకురాగలదు. శరీరంలోని ఏ కండరానికి నొప్పి వచ్చినా కాని మెడ నొప్పి అంత ప్రభావం వుండదు. దీనికి సరి అయిన వైద్యం చేయకపోతే పరిస్దితి మరింత దిగజారే ప్రమాదం కూడా వుంది. ప్రధానంగా సరిగ్గా పడుకోకపోవటం వలన వస్తుంది. మనమంతా నిద్రలో సరిగా పడుకోము. ఆ కారణంగా మెడ వెనుక భాగంలో నొప్పి వస్తూనే వుంటుంది. మనం వేసుకునే తలగడ సరి లేకున్నా మెడనొప్పి వచ్చే అవకాశం వుంది. కొంతమంది ఎంతో చిన్న దిండ్లను వాడి సమస్య తెచ్చుకుంటారు.

మరి కొంతమంది అధిక ఎత్తు కల తలగడలు వాడతారు. అధిక బరువులను ఒక్కసారి పైకి ఎత్తటం కూడా మీ శరీర గురుత్వాకర్షణ శక్తికి భంగం వాటిల్లి మెడ నొప్పి వచ్చే ప్రమాదం వుంది. సరిగ్గా కూర్చొనకపోయినా ఒకోసారి ఈ నొప్పి వచ్చే అకాశం వుంది. ఈ నొప్పి ఎముకలలో జరిగే కొద్దిపాటి మార్పుకు వచ్చేసే అవకాశం వుంది. సాధారణంగా ఇంట్లో ఇతర శరీర నొప్పులకు అనేక పరిష్కారాలుంటాయి. కాని మెడనొప్పి అంత తొందరగా పరిష్కరమయ్యేది కాదు. దీనికి మంచి మందు అంటే – తిన్నగా సరి అయిన పొజిషన్ లో ఒక రాత్రి పూర్తిగా మంచి నిద్రపోవటమే. మరుసటి దినం ఉదయానికి సుమారుగా 70 శాతం నొప్పి తగ్గిపోతుంది. ఇక మెడను ఆ పక్కకు, ఈ పక్కకు మెల్లగా తిప్పే వ్యాయామాలు కొంత ఉపశమనమివ్వగలవు.

here it is how you can get rid of neck pain

వెచ్చటి శరీర నూనె మెల్లగా మెడచుట్టూతా, భుజాలూ మర్దన చేస్తే ఎంతో రిలీఫ్ దొరుకుతుంది. ఒక మందపాటి గుడ్డను వేడినీటిలో ముంచి మెడకు చుట్టినా అది మెడ కండరాలపై ప్రభావం చూపి నొప్పిని తగ్గించే అవకాశాలున్నాయి. తక్షణ నొప్పి మందులు లేదా స్ప్రే లు వాడవచ్చు. కాని సమస్యను సమూలంగా ఇవి తగ్గించలేవు. అవి మీ మెడ కండరాలను తిమ్మిరి ఎక్కించి నొప్పిని తగ్గిస్తాయి. దీని కొరకు పెయిన్ కిల్లర్ మందులు మింగటం ఏ మాత్రం సరికాదు. మన బిజీ జీవితాల్లో మెడ నొప్పులు కూడా త్వరగా తగ్గాలని మనం ప్రయత్నిస్తాం. కాని మీ వేగాన్ని కొంత తగ్గించండి. మందులు వాడకం విచక్షణతో కూడినది కాకుంటే దీర్ఘకాల చెడు ప్రభావాలుంటాయి. నొప్పులవంటి చిన్న చిన్న అనారోగ్యాలు సహజపద్ధతులద్వారా నివారించుకుంటే ఆ పరిష్కారం శాశ్వతంగా కూడా వుంటుంది. కనుక శరీరం దానికదే నొప్పులు తగ్గించుకునేందుకు కొంత సమయం ఇవ్వండి.

Admin

Recent Posts