Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

40 ఏళ్లు దాటిన వారు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య నియ‌మాలు..!

Admin by Admin
February 26, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆరోగ్య సంరక్షణ అన్నది అందరికీ వర్తించినా, నలభైకి చేరువ అవుతుంటే మాత్రం వారు మరింత జాగరూకతతో ఉండాలి. సాధారణంగా ఆ వయసులో డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్ వంటివి కనిపిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మనం మంచి జీవనశైలి అంటే…మంచి ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లను విసర్జించడం వంటి అంశాలపై దృష్టినిలపడం అవసరం. మన ఆహారంలో కాయధాన్యాలు, తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను వీలైనంత తగ్గించాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొలెస్ట్రాల్, చక్కెర పాళ్లు తక్కువగా ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.

నలభైల్లో ఉండేవారు ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌ను దీర్ఘకాలం కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం. అందునా శరీరాన్ని అతిగా కష్టపెట్టే బాడీ బిల్డింగ్ వ్యాయామాల కంటే తేలికపాటి శారీరక శ్రమ కలిగించే నడక వంటివి మంచి వ్యాయామ ప్రక్రియలని గుర్తుంచుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 45 నిమిషాల పాటు నడవడం చాలా మంచిది. ఈ జాగ్రత్తలతో పాటు పొగతాగడం, మద్యపానం, పొగాకు ఉత్పాదనలను నమలడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మంచి జీవనశైలిని పాటించినట్లవుతుంది. దాంతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది.

if you crossed 40 years of age then must follow these health tips

హోమియో చికిత్సా ప్రక్రియలో మనిషి జీవన విధానం, అతడి వయసు, నివసించే ప్రదేశం, ఆహార అలవాట్లు, శారీరక లక్షణాలు, మానసిక దౌర్బల్యాల వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు సూచిస్తారంటే జీవనశైలికి హోమియో విధానం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలిసిపోతుంది. పైగా హోమియో విధానం స్వాభావికంగా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను దూరం చేస్తుంది. ఇక జీవనశైలి సైతం స్వాభావికంగానే వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి నలభైల్లో ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సిన ఆవశ్యకత ఉంది.

Tags: health tips
Previous Post

నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

Next Post

ఆలయ నీడ పడే ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే ఇంత ప్రమాదమా..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!