హెల్త్ టిప్స్

క‌డుపు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. వీటిని తీసుకోవాలి..!

కడుపు నొప్పికి రకరకాల కారణాలున్నాయి. మలబద్దకం, గ్యాస్, లాక్టోజ్ సరిగ్గా జీర్ణం కాకపోవడం, డయేరియా, ఒత్తిడి మొదలగు అనేక కారణాలున్నాయి. ఐతే వీటన్నిటి నుండి విముక్తి పొంది కడుపునొప్పిని దూరం చేసుకోవచ్చు. అలా దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. మలబద్దకం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీనికి ప్రధాన కారణం పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోకపోవడమే. మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళూ ఎక్కువగా తాగకపోవడం, అధిక ఒత్తిడి కూడా మలబద్దకానికి కారణాలు. అలాగే పాల పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా మలబద్దకం వస్తుంది. మరి దీన్ని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి?

పీచు పదార్థం కలిగిన పండ్లు, కూరగాయలని ఆహారంలో భాగం చేసుకోవాలి. బొప్పాయి మొదలగు వాటిని తీసుకుంటే మేలు కలుగుతుంది. కావాల్సినన్ని నీళ్లు తాగుతూ, పొద్దున్న లేవగానే నిమ్మరసం కలిగిన నీళ్ళు తాగితే మలబద్దకం సమస్య ను బయటపడవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే డయేరియా డ్రగ్స్, ఫుడ్ ఎలర్జీ మొదలగు వాటి వల్ల కూడా కలుగుతుంది. దీని నుండి బయటపడాలంటే కొబ్బరినీళ్ళు, బటర్ మిల్క్ వంటివి తాగడం మంచిది.

if you have stomach pain take these foods

సాధారణంగా కొందరికి పాలల్లో ఉండే లాక్టోస్ అనే ఎంజైమ్ జీర్ణం కాదు. దీనివల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు పాలకి దూరంగా ఉండడం మంచిది. మలబద్దకం సమస్య వల్ల శరీరంలో గ్యాస్ పెరుగుతుంది. దీన్నుండి బయటపడాలంటే, కావాల్సినన్ని నీళ్ళు తాగాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి. అప్పుడే శరీరంలో గ్యాస్ ని తగ్గించవచ్చు.

Admin