business

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అసలు ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">సత్యం అంటే నిజం&period; పాలన&comma; విధివిధానాల్లో నీతి&comma; నిజాయితీకిగాను ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ బహుమతిని రెండు సార్లు గెలుచుకుంది సత్యం&period; 50&comma;000 పైచిలుకు ఉద్యోగులతో 60 దేశాల్లో కార్యాలయాలతో మన దేశపు నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా విరాజిల్లింది సత్యం&period; E&amp&semi;Y Entrepreneur Of The Year&comma; 2008 అవార్డుకు ఎంపికయ్యారు రామలింగరాజు&period; దాదాపు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాదులో ఐటీ సంస్థల పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రానికి నిధులు సమకూర్చే ప్రణాళికపై నేరుగా అప్పటి ముఖ్యమంత్రితో చర్చలకు వెళ్ళేవారాయన&period; మరి అంత మందిని అన్ని రోజులు అంత తేలిగ్గా ఎలా మోసం చెయ్యగలిగారు&quest; తొమ్మిదేళ్ళలో 7&comma;561 నకిలీ బిల్లులు&comma; బ్యాంకు స్టేట్‌మెంట్లతో సంస్థ లెక్కల్లో సుమారు 7&comma;000 కోట్ల రుపాయలు తారుమారు చేశారట రాజు&period; ఎందుకు&quest; ఎలా&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందు కాస్త నేపథ్యం&period; 1987లో రామరాజు&comma; రామలింగరాజు సోదరులు 20 మంది ఉద్యోగులతో ఐటీ&comma; బీపీవో సేవలకు స్థాపించిన సంస్థ సత్యం కంప్యూటర్ సర్వీసెస్&period; 1991లో BSEలో లిస్ట్ అయిన వెంటనే ఫార్ట్యూన్ 500 సంస్థ అయిన Deere &amp&semi; Coను క్లయింట్‌గా పొందాక తిరుగులేని వృద్ధి మార్గాన దూసుకెళ్ళింది&period; సంస్థ విలువ 2003లో బిలియన్ డాలర్లు దాటి 2008 ఆర్థిక మాంద్యం సమయానికి 2 బిలియన్ డాలర్లు అయింది&period; ఆ కాలంలో ఏటా ఆదాయం 40&percnt;&comma; లాభాలు 21&percnt; వృద్ధితో సంస్థ షేర్లు 300&percnt; పెరిగాయి&period; అప్పుడు మొదలైంది తీగ లాగితే డొంక కదిలే ప్రక్రియ&period; అంతటికీ మూలకారణం రియల్ ఎస్టేట్&period; 1988లోనే మేటాస్ పేరుతో &lpar;Satyam తిరగేస్తే Maytas&rpar; ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు రామలింగరాజు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78298 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;satyam&period;jpg" alt&equals;"do you know what is satyam computers scam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2000 దశకం మొదలయే నాటికి రియల్ ఎస్టేట్ అంటే బంగారు బాతు బాపతు&period; ఆ వేలంవెర్రి రాజు గారినీ వదల్లేదు&period; పైగా ప్రభుత్వంలో పెద్ద తలలతో దోస్తీ ఉండనే ఉంది&period; అలా త్వరలో రాబోయే మెట్రో గురించి ముందుగానే వివరాలు తెలిసే సరికి సత్యంలో నుంచి నిధులను మేటాస్‌కు తరలించి నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాడు&period; అసలా నిధులు సత్యంకు ఎక్కడివి&quest; ఇది స్కామ్ అర్థం చేసుకోటానికి కీలకమైన వివరం&period; కొన్ని క్షణాల్లో ఈ వివరం చూద్దాం&period; 2008లో సత్యం బోర్డు 300 మిలియన్ డాలర్లకు మేటాస్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది&period; అసలు ఐటీ సంస్థకు రియల్ ఎస్టేట్ సంస్థను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ఇన్వెస్టర్లు ప్రశ్నించారు &&num;8211&semi; ఫలితంగా షేరు కాస్త పతనమైంది&period; ఈ దెబ్బకు బోర్డు ప్రయత్నాన్ని విరమించుకున్నా సాఫీగా నడుస్తున్న సంస్థ ఇలాంటి అసంబద్ధ చర్య తీసుకోవటం ఏమిటని ప్రశ్నించిన వరల్డ్ బ్యాంకు తన అనుబంధ సంస్థలేవీ ఎనిమిదేళ్ళ పాటు సత్యంతో వ్యాపార లావాదేవీలు సాగించకూడదన్న ఆజ్ఞ జారీ చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దెబ్బకు షేరు à°§à°° మరింత పతనమైంది&period; వరల్డ్ బ్యాంకు చర్య నిరాధారమని&comma; ఆ చర్య పర్యవసానాన తమ సంస్థపై ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లినందుకు వరల్డ్ బ్యాంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది సత్యం బోర్డు&period; అసలు మేటాస్‌ను కొనుగోలు చెయ్యాల్సిన అవసరం సత్యంకు ఏమిటి&quest; ఇది స్కామ్ అర్థం చేసుకోటానికి మరొక కీలకమైన వివరం&period; పైన చెప్పుకున్న నిధుల వివరం ఇప్పుడు చూద్దాం&period; 1999 నుంచే రామలింగరాజు తన వ్యక్తిగత కంప్యూటర్ నుండి నకిలీ బిల్లులు&comma; బ్యాంకు స్టేట్‌మెంట్లను సృష్టించి సత్యం ఆదాయ&comma; లాభాలను ఎక్కువగా చూపటం మొదలు పెట్టాడు&period; ఫలితంగా సంస్థ విలువ&comma; షేరు à°§à°° పెరుగుతూ పోయింది&period; అలా పెరిగిన ప్రతి సారీ యజమాని హోదాలో తనకు జారీ చేయబడిన షేర్లను పలు విడతల్లో ఎక్కువ ధరకు అమ్ముతూ వచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-78296" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;satyam-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా నకిలీ ఉద్యోగులను&comma; వారికి జీతాలిస్తున్నట్టు ఋజువులను సృష్టించి నెలకు దాదాపు ముప్పై లక్షలు సంస్థ నుండి తీసుకుంటూ వచ్చాడు&period; ఈ నిధులన్నీ మెట్రో ప్రాజెక్టు దక్కించుకున్న మేటాస్‌లో పెట్టుబడికి వాడాడు&period; మెట్రో పూర్తయితే మేటాస్‌కు లాభాల పంట పండుతుంది కాబట్టి అలా వచ్చిన లాభాలతో సత్యం నుండి మళ్ళించిన నిధులను మళ్ళీ అక్కడికే మళ్ళించి తతంగాన్ని నిశ్శబ్దంగా ముగిద్దాం అనుకున్నాడు&period; అయితే అప్పటికే అమెరికాలోని రియల్ ఎస్టేట్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంగా పరిణమించటం మొదలైంది&period; ఆ దెబ్బకు మెట్రో పనులు నెమ్మదించాయి&period; ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు&period; సుమారు బిలియన్ డాలర్ల అప్పు కేవలం పుస్తకాల్లో ఉన్న నకిలీ లాభాలతో తీర్చటం అసంభవం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరిగ్గా ఆ సమయానికి అప్పటికే తొమ్మిదేళ్ళుగా సాగుతున్న నకిలీ బిల్లులు&comma; నిధుల మళ్లింపు గురించి ఒక ఆకాశరామన్న ఈ-మెయిల్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణ పాలెపుకు పంపబడింది&period; ఆయన ఆ ఈ-మెయిల్‌ను సత్యం ఆడిటర్లయిన PWCలోని గోపాలకృష్ణన్‌కు పంపి&comma; అదంతా అబద్ధమని ఋజువు చేసేందుకు 2008&comma; డిసెంబరు 29à°¨ ఆడిటర్లతో మీటింగ్ ఏర్పాటు చేసారు&period; ఆ మీటింగ్ బహిరంగపరచని కారణాలతో జనవరి 10కి వాయిదా పడింది&period; ఆ పరిస్థితిని దాటేందుకు రాజు ముందున్న ఒకే ఒక దారి సత్యం మేటాస్‌ను కొనుగోలు చేసి గందరగోళం మొత్తం పూడ్చి పెట్టే ప్రయత్నం&period; అది కాస్తా మదుపర్లు తిరస్కరించటంతో బెడిసికొట్టింది&period; జనవరి 7&comma; 2009à°¨ రాజు ఏళ్ళుగా తాను సంస్థ ఆదాయలాభాలను ఎక్కువ చేసి చూపినట్టు చెబుతూ తన రాజీనామా బహిరంగంగా సమర్పించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-78297" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;satyam-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేశంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి&comma; బహుమతి పొందిన సత్యం మేడిపండు అన్న విషయం బట్టబయలైంది&period; రాజు ఇంటిని సోదా చేసిన సీబీఐ చేతికి 13&comma;000 నకిలీ ఉద్యోగులను సృష్టించిన ఋజువులు దొరికాయి&period; అసలు అన్నేళ్ళుగా PWC ఆడిటర్లు సంస్థలోని మోసాన్ని కనుగొనలేకపోవటం ప్రపంచాన్ని విస్మయ పరిచింది&period; వారు అంత పెద్ద మోసాన్ని చూసీచూడనట్టు ఉండటానికి పుచ్చుకున్న నజరానా అన్నేళ్ళుగా రెండింతలు ఫీజు&period; ఇదంతా ఋజువయ్యాక PWC లైసెన్స్ రెండేళ్ళ కాలానికి రద్దు చేయబడింది&period; ఫలితంగా వారు ఆడిట్ చేసిన సంస్థలన్నిటి షేర్లు 15&percnt; మేర పతనమయ్యాయి&period; 2008లో 544 రుపాయలున్న సత్యం షేర్లు 11 రుపాయలకు పడ్డాయి&period; సెన్సెక్స్ సైతం 7&percnt; పడింది&period; నష్టాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం స్వయంగా సత్యంను 100 రోజుల్లో ఏదోక సంస్థకు అమ్మివేయాలన్న ఆదేశాలతో ఒక కమిటీని నియమించింది&period; తుదకు సత్యం టెక్ మహీంద్రా గూటికి చేరింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts