హెల్త్ టిప్స్

తీవ్ర‌మైన ఒత్తిడి, ఆందోళ‌న ఉన్నాయా..? అయితే ఈ ఒక్క పండు తినండి చాలు..!

సాధారణంగా మనకి అరటిపళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. పైగా అన్ని సీజన్స్ లో కూడా ఇవి మనకి చాలా అందుబాటులో ఉంటాయి. దీనిని తినడం వల్ల చాలా పోషకాలు మనకి లభిస్తాయి. అయితే మరి అరటి పళ్ళు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయనేది ఇప్పుడు చూద్దాం. అరటి పండు లో నాచురల్ షుగర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి 6 , విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ప్రోటీన్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ అన్నీ ఉంటాయి. పైగా కొలెస్ట్రాల్ కూడా ఉండదు.

ఏకంగా ఇందులో 105 కేలరీలు ఉంటాయి. పైగా వాటర్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ కూడా దీనిలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తినటం వలన నిజంగా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. అరటి పండ్లు తీసుకోవడం వల్ల మజిల్స్ ని బిల్డ్ చేస్తుంది. పైగా మజిల్ రికవర్ కూడా చేస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయం లో ఒక అరటిపండు తీసుకుంటే ఒత్తిడి నుంచి బయట పడవచ్చు.

if you have stress and anxiety take banana

అరటి పండు లో ఉన్న విటమిన్ బి9 ఒత్తిడి తో పోరాడి త్వరగా మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయట పెడుతుంది. అరటి పండ్లు తీసుకోవడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ ను పెంచుతుంది. కాబట్టి డయాబెటిక్ తో ఉన్న వారు దీనికి దూరంగా ఉండటం మంచిది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక అరటి పండు తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. స్నాక్స్ కు బదులుగా అరటి పండు తీసుకోవడం ఉత్తమం.

Admin

Recent Posts