Sleeping : ఈ రోజుల్లో చాలా మంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక సమస్యలు కలుగుతుంటాయి. పైగా ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే పలు సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. మనిషి సగటున ఏడు నుండి ఎనిమిది గంటల పాటు రోజూ నిద్రపోవాలి. అయితే కొందరు ఏం చేస్తారంటే ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి.
ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన శరీర బరువు పెరిగిపోతుంది. దీంతో మీరు అధిక బరువు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగా ఎక్కువ సేపు నిద్రపోతే గుండె జబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. ఎక్కువసేపు నిద్రపోతే వేగంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని స్టడీ చెప్తోంది. కాబట్టి అతిగా అసలు నిద్రపోకండి.
ఎక్కువసేపు నిద్రపోవడం వలన మెదడు సామర్ధ్యం బాగా తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. ఎనిమిది గంటలకంటే ఎక్కువగా నిద్రపోవడం వలన తలనొప్పి కూడా వస్తుంది. ఎనిమిది గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అంతసేపు నిద్రపోకండి.
అంతేకాకుండా ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన ఒత్తిడి బాగా పెరుగుతుంది. మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అశాంతి వంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి నిద్ర విషయంలో కచ్చితంగా ఈ నియమాలని పాటించండి. మరీ ఎక్కువ సేపు, మరీ తక్కువ సేపు కాకుండా ఎనిమిది గంటల పాటు నిద్రపోండి. అంతకు మించి నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు. కాబట్టి అసలు ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఒత్తిడి వంటి బాధలు కూడా ఉండవు. ప్రశాంతంగా ఉండొచ్చు. రోజూ ఒకే టైంకి నిద్ర పోయి, ఒకే టైంకి నిద్ర లేస్తే ఆరోగ్యం బాగుంటుంది.