హెల్త్ టిప్స్

Banana Milk : ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

Banana Milk : ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో సతమతమవుతుంటే.. మరికొందరు చూడటానికి సన్నగా ఉన్నామంటూ బరువు ఎలా పెరగాలి అంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అధిక బరువు మరియు తక్కువ బరువు అనేవి రెండూ సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి మీరు సమతుల్య బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి నిత్యం చాలా కష్టపదుతుంటారు. ఆరోగ్యకరంగా బరువు పెరగాలి అంటే కండరాలకు బలాన్ని ఇచ్చే పోషక విలువలున్న ఆహారం ఎంతో అవసరం. బరువు పెరగడంలో అరటిపండు అనేది ఎంతగానో సహకరిస్తుంది.

అరటి పండు, పాలు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే అరటిపండులో పొటాషియం, విటమిన్లు, డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. పాలల్లో కూడా ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం మరియు ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి సహజసిద్ధంగా బరువు పెరగడానికి సన్నగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఉపయోగపడ‌తాయి.

if you want to increase your weight then take banana with milk

ఒక అరటి పండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలను పోసి బాగా మిక్సీ చేసుకోవాలి. అలా తయారైన జ్యూస్ ని గ్లాసులో పోసుకుని ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. అరటి పండుతో తయారు చేసిన ఈ పాలను ఉదయం సమయంలో తీసుకోవాలి. బరువు తక్కువగా ఉన్నవారు ఈ పాలను తాగితే కచ్చితంగా బరువు పెరుగుతారు. అరటిపండు, పాలు రెండింటిలోను కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.

అంతేకాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచటమే కాకుండా, కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది. అరటిపండ్లలో సంక్లిష్టమైన పిండి పదార్థాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో గ్లూకోజ్‌ను స్థిరంగా పంపి వర్కవుట్ చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని తేమగా ఉంచి, వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. 40 ఏళ్లు పైబడిన వారు ఈ పాలను వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది కాబట్టి. చిన్న వయసు వారు ప్రతినిత్యం అరటిపండుతో తయారుచేసిన ఈ పాల‌ను తాగడం ద్వారా త్వరగా ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు.

Admin

Recent Posts