పొట్ట భాగాన్ని తరచుగా లోపలికి లాగుతూండటం ద్వారా యాక్టివేట్ చేయండి. శ్వాస బిగపట్టకుండా ఈ చర్య చేయాలి. తరచుగా మీ పొట్ట భాగాలను బెండ్ చేస్తూ కిందకు వంగండి. మీరు తినే ఆహారం పొట్ట సైజు మెయిన్టెయిన్ చేటానికి ప్రధానమైంది. కొవ్వు, షుగర్ వంటివి తగ్గించండి. పండ్లు, వెజిటబుల్స్, మొలకెత్తిన విత్తనాలు, పప్పులు అధికంగా తినండి.
లిఫ్ట్ లు వుపయోగించేకంటే మెట్లు ఎక్కండి. రొప్పు రాకుండా మెల్లగా ఎక్కటం సాధన చేయండి. కూర్చుని పని చేసే వారయితే, సరైన రక్త ప్రసరణకు గాను ప్రతి గంటకు లేచి అయిదు లేదా ఆరు అడుగులు వేయండి. కాఫీ మానేసి గ్రీన్ టీ తాగండి. నిద్ర లేచిన వెంటనే, నిద్రించేముందు నీరు అధికంగా తాగండి.
మీ ఆహారాన్ని చిన్న భాగాలుగా చేసి 5 లేదా 6 సార్లు రోజులో తినండి. పొట్ట మరింత త్వరగా తగ్గాలంటే, బీరు పూర్తిగా మానండి. మానలేకపోతే, వారానికి ఒక సారి మాత్రమే అది కూడా మితంగా అనే నియమం పెట్టుకోండి. బీరు తప్పక తాగాల్సివస్తే….ప్రతి బీరు గ్లాసుకు మధ్య ఒక గ్లాసు నీరు తాగండి. తాగేటపుడు సైడ్ డిష్ గా తక్కువ కేలరీ ఆహారాలు మాత్రమే తినండి.