బీరును రెగ్యులర్ గా తాగితే తరచుగా మీరు గొంతులో చేదు లేదా ఛాతీ భాగంలో నొప్పి భావించుతూండటం జరుగుతుంది. దీనినే గుండె మంట లేదా హార్ట్ బర్న్ అంటారు. బీరు తాగితే గుండెమంట వస్తుందా? అంటే వస్తుందనే చెప్పాలి. అయితే ఈ మంట తగ్గించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పడాలి. బీరు కూడా ఆల్కహాలు సంబంధమే. కనుక సహజంగానే ఆమ్లపిత్తాన్ని అధికం చేసి గుండెమంట కలిగిస్తుంది.
దీనికి కారణం ఆల్కహాలు అన్నవాహిక కండరాన్ని కిందిభాగంలో రిలాక్స్ చేస్తుంది. సీలులా పని చేసే ఈ కండరం అన్నవాహికను పొట్టనుండి వేరు చేస్తూ వుంటుంది. దీని డ్యూటీ పొట్టలోని ఆమ్లాన్ని పొట్టలోనే వుంచడం. ఎప్పుడైతే ఈ కండరం రిలాక్స్ అయిందో పొట్టలోని ఆమ్లం అన్నవాహికలోకి వస్తుంది అదే మంట కలిగిస్తుంది.
బీరు అన్నవాహిక కండరాన్ని రిలాక్స్ చేయటమే కాక పొట్టకు కూడా మంట కలిగిస్తుంది. దీనితో అధిక ఆమ్లం పొట్టలో ఉత్పత్తి అవటం అది కూడా వెనక్కు తంతూ గుండెమంట కలిగిస్తుంది. ఈ మంట రాకుండా వుండాలంటే రాత్రి వేళ బీరు తాగకుండా వుండటమే మంచిది. అంటే జీవప్రక్రియ బాగా సాగే పగటిపూట దీని ప్రభావం అంతగా వుండకపోవచ్చు. లేదా బీరు తాగిన వెంటనే కొన్ని గ్లాసుల నీరు తాగితే సరిపోతుంది. లేదా కొన్ని యాంటాసిడ్ టాబ్లెట్లు వేసినా సరిపోతుంది. ఇక బీరు తాగినా గుండెమంట రాదు.