చిట్కాలు

ఎసిడిటీని తరిమికొట్టేందుకు చిట్కాలు..!

ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్య ఎసిడిటీ. ఇది పని ఒత్తిడి వల్ల, వేళకాని వేళలో తినడం వల్ల, ఫాస్ట్‌ఫుడ్ వంటకాలు, మసాలాలు అవీఇవీ అని రుచి కోసం అడ్డమైనవన్నీ వేసి తయారు చేసే వంటలను తినడం వల్ల వచ్చే సమస్య. అంతేకాదు మనం తినే ఆహారంలో ఉప్పు, కారం ఎక్కువగా ఉండటం వల్ల కూడా వస్తుంది. అంతేనా అంటే ఇంకా వుంది.. చిన్న, చిన్న విషయాలకు కోపం తెచ్చుకుని, వారి కోపమంతా అన్నంపై చూపించి ఆ పూట అన్నం తినరు. అలా అప్పుడప్పుడు తినకపోవడం వల్ల కూడా ఈ గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఏదీ సరిగా తినలేరు. తిన్నది జీర్ణం కాదు, కడుపులో మంటగా, వికారంగా ఉంటుంది.

కడుపు ఉబ్బరం లాంటి వాటితో బాధపడుతుంటారు. ఈ సమస్యను తొలి దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్య ముదిరి అల్సర్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఎసిడిటి సమస్యలున్నవారు ఈ సూచనలను పాటిస్తే బయటపడవచ్చు. టీ స్పూన్ అల్లంరసంలో అర టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకుంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది. గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్‌ల తేనె, అల్లం ముక్కలు చిన్నవి కలిపి మిక్స్ చేసిన మిశ్రమాన్ని అజీర్తిగా అనిపించివప్పుడు తాగాలి. మంచి ఫలితాన్ని ఇస్తుంది. బేకింగ్ సోడా, మంచినీళ్ళు సమానంగా కలిపి తీసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

follow these wonderful health tips to reduce acidity

తిన్న తర్వాత ఒక కప్పు అల్లంటీ తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది. ఎసిడిటీతో బాధపడుతున్న వారు అన్నం తిన్న తర్వాత రెండు లవంగాలను నోట్లో వేసుకుని రసం మింగుతుండాలి. ఆహారం తినేప్పుడు నమలకుండా గబగబా మ్రింగడం, మాట్లాడుతూ తినడం, మద్యం, పొగత్రాగటం వంటివి గ్యాస్‌కి ముఖ్య కారణాలు.ఆహారనాళంలో జీర్ణం కాని పదార్థాన్ని బాక్టీరియా తీసుకుని గ్యాస్‌‌ని విడుదల చేస్తుంది. ప్రేగుల్లోని కొన్ని బాక్టీరియాలు గ్యాస్‌ను ఎక్కువగా తయారుచేస్తాయి.

గ్యాస్ రాకుండా ఉండాలంటే.. ఆహారాన్ని నిదానంగా బాగా నమిలి తినాలి, తక్కువగా తినాలి. పొగత్రాగడం, మద్యం సేవించడం లాంటి అలవాట్లను వెంటనే మానేయాలి. కూల్‌డ్రింక్స్ తాగటం, తీపి పదార్థాలను తినడం తగ్గించాలి. వేళకు తినాలి. రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల వరకు నీటిని తాగాలి.

Admin

Recent Posts