హెల్త్ టిప్స్

ఉప‌వాసం( Fasting) ఉన్న‌ప్పుడు సెక్స్‌లో పాల్గొన‌వ‌చ్చా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయా వ‌ర్గాల‌కు చెందిన మ‌త విశ్వాసాలను కొంద‌రు మూఢ‌న‌మ్మ‌కాల‌ని కొట్టి పారేస్తారు. కానీ నిజానికి వాటిలోనూ సైన్స్ ప‌రంగా ఎన్నో విష‌యాలు దాగి ఉన్నాయ‌ని అంద‌రికీ తెలుసు. అలాంటి విశ్వాసాల్లో ఉప‌వాసం ఉండ‌డం కూడా ఒక‌టి. దేవుడి పేరిటే కాకుండా కొంద‌రు వారంలో ఒక రోజు, రెండు రోజులు ఉప‌వాసం చేస్తారు. అయితే సైన్స్ ప‌రంగా చెప్పాలంటే ఉప‌వాసం ఉండ‌డం మ‌న శ‌రీరానికి మంచిదే. దాంతో జీర్ణ వ్య‌వ‌స్థ‌కు విశ్రాంతి దొరుకుతుంది. ఈ క్ర‌మంలో ప‌లు రుగ్మ‌త‌లు కూడా వాటంత‌ట అవే న‌యం అయిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఉప‌వాసం ఉన్న స‌మ‌యంలో చేయ‌కూడ‌ని (లేదా చేసే) ఓ పని గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. అదే ర‌తి క్రీడ‌. అవును, షాకింగ్‌గా ఉన్నా, మీరు వింటోంది క‌రెక్టే. ఉప‌వాసం ఉన్న‌ప్పుడు అస‌లు ర‌తిక్రీడ చేయ‌వ‌చ్చా..? కూడ‌దా..? ఏయే వ‌ర్గానికి చెందిన విశ్వాసాలు ఏం చెబుతున్నాయి..?

హిందువుల్లో ఉప‌వాసంతో ఉన్న‌ప్పుడు ర‌తిలో పాల్గొన‌కూడ‌ద‌ని ఎక్క‌డా పేర్కొన‌బ‌డ‌లేద‌ట‌. కానీ ఉప‌వాసం చేసేట‌ప్పుడు సాధార‌ణంగానే శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. ఇక అలాంటి సందర్భంలో చాలా మంది ర‌తి క్రీడ ఏం చేస్తారు..? చేయ‌రు..! ఇస్లాంలో రంజాన్ మాసంలో ముస్లింలు ఉప‌వాసం చేస్తారు క‌దా. రోజంతా ఉప‌వాసం ఉండి సాయంత్రం సూర్యాస్త‌మ‌యం కాగానే ఆహారం తింటారు. మ‌ళ్లీ ఉద‌యం సూర్యుడు ఉద‌యించ‌గానే దీక్ష ప్రారంభిస్తారు. అయితే అలాంటి స‌మ‌యంలో వారు రాత్రి పూట సెక్స్‌లో పాల్గొన‌వ‌చ్చ‌ట‌. ప‌గ‌టి పూట నిషేధ‌మ‌ట‌.

is it ok to do sex in fasting

బౌద్ధ మ‌తంలో ఉప‌వాసం ఉన్న రోజున సెక్స్‌లో పాల్గొన‌డం నిషేధించ‌బ‌డింది. ఆ రోజు ఎవ‌రూ ర‌తి క్రీడ చేయ‌కూడ‌ద‌ట‌. క్రిస్టియానిటీలో ఉప‌వాసం రోజున సెక్స్‌లో పాల్గొన‌కూడ‌ద‌ని ఎక్క‌డా లేద‌ట‌. ఆ రోజున ఎవ‌రైనా ర‌తి క్రీడ‌లో పాల్గొన‌వ‌చ్చ‌ట‌. జుడాయిజంలో ఉప‌వాసం ఉన్న‌ప్పుడు సెక్స్‌లో పాల్గొన‌కూడ‌ద‌ని ఈ వ‌ర్గంలో నిషేధం ఉంది. ఆ రోజున స‌ద‌రు వ‌ర్గీయులు తాము చేసిన పాపాల‌కు ప్రాయ‌శ్చితం క‌ల‌గాల‌ని దైవాన్ని ప్రార్థించాల‌ట‌.

Admin