మగవారిలో నపుంసకత్వానికి అసలు ట్రీట్ మెంట్ వుందా అని చాలా మంది వండర్ అవుతారు. ఉంది. ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూద్దాం….. పురుషులలో నపుంసకత్వం అంటే….బిడ్డలను కనలేకపోవటం….స్త్రీని గర్భవతిని చేయలేకపోవటం. తల్లికాలేమని తెలుసుకున్న స్త్రీలు తమ పురుషుడితో వెంటనే తెగతెంపులు చేసుకోడం పరిపాటే. ఇక అటువంటి పురుషులందరకు కొద్దిపాటి ఆశ కలిగే మార్గాలు చూడండి. పురుషులలో నపుంసకత్వం చాలా కారణాలుగా వుంటుంది. జననాంగం పని చేయకపోవచ్చు. త్వరగా స్కలనమైపోవచ్చు. స్పర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు. లేదా వీర్యం తక్కువగా కూడా వుండవచ్చు.
మగవారి నపుంసకత్వాన్ని పోగొట్టేందుకు ఆయుర్వేదంలో ఎన్నో మందులున్నాయి. అవే కాకుండా అనేక మందులు, స్ప్రేలు, లోషన్లు, నూనెలు ఎన్నో వున్నాయి. సహజ ఆహార పదార్ధాలు తీసుకుని శరీరంలోని జననాంగాలను రిపేరు చేసుకోవచ్చు. పొగ తాగటం మానటం, డ్రగ్స్ వదిలేయటం, మింట్ నమలకుండా వుండటం మొదలైనవి సాధారణంగా చెప్పేవి. కొన్ని ఆయుర్వేద ఔషధ మూలికలను పాలతో కలిపి తీసుకుంటే, వీర్యం వృధ్ధి చెంది త్వరగా స్కలనం కాకుండా అంగం నిలబడి వుంటుంది.
అంగం పడిపోతూ వుంటే, దానికి గాను కొన్ని పరికరాలు వేసి నిలబెట్టే మార్గాలున్నాయి. ఈ పరికరాలు జననాంగాన్ని కొంతసేపు నిలబెట్టి విజయవంతమైన కేసులు వున్నాయని తెలుస్తోంది. కొన్ని వ్యాయామాలు చేయడం, ధ్యానం, యోగా మొదలైనవి జననాంగం నిలబడటానికి ఉపయోగిస్తాయి. వ్యాయామాలు రక్త సరఫరాను బాగు చేసి ఆందోళన లేకుండా ప్రశాంతతను చేకూరుస్తాయి. రతిక్రీడకు ముందు చాక్లెట్లు తింటే కూడా ఆంధోళన లేక ఒత్తిడి తగ్గి శరీరానిక కావలసిన శక్తి సమకూరుస్తుందని కూడా పోషకాహార నిపుణులు చెపుతున్నారు.