Ivy Gourd : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలను చాలా మంది తరచూ తింటుంటారు. దొండకాయలతో ఎక్కువగా వేపుడు, పచ్చడి వంటివి చేస్తుంటారు. అయితే దొండకాయ అంటే చాలా మంది ఒక సాధారణ కూరగాయ అనుకుంటారు. కానీ దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయన్న విషయం చాలా మందికి తెలియదు. దొండకాయలను తింటే మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దొండకాయల వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, విటమిన్లు ఎ, సి ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి. దొండకాయల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దొండకాయలను తినడం వల్ల పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరరీంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. కనుక హైబీపీ ఉన్నవారు తరచూ దొండకాయలను తినాలి. అలాగే వీటిల్లో ఉండే ఐరన్ మనల్ని రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది.
దొండకాయల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణసమస్యలను తగ్గిస్తుంది. అధిక బరువు తగ్గేలా చేస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్దకం ఉన్నవారితోపాటు అధిక బరువు ఉన్నవారు రోజూ దొండకాయలతో చేసిన జ్యూస్‌ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ సమస్యల నుంచి సులభంగా బయట పడతారు. ఇక ఈ కాయలను తింటే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా చూస్తాయి.
దొండకాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇది ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి మేలు చేసే విషయం. అలాగే దొండకాయలను తింటే లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. ఇలా దొండకాయలతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ ఆహారంలో తినాలి.