Lemon Seeds For Liver Detox : పూర్వకాలంలో మన పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వారు తీసుకున్నవి ఆరోగ్యకరమైన ఆహారాలు. కనుక వారు వృద్ధాప్యం వచ్చినా ఎలాంటి రోగాలు లేకుండా బలవర్ధకంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం నడుస్తున్నది జంక్ ఫుడ్ యుగం. చిన్నతనంలోనే చాలా మందికి జంక్ ఫుడ్ అలవాటు అవుతోంది. దీంతో అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఫుడ్ వల్ల శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతున్నాయి. అలాగే మద్యం సేవించడం కూడా అధికమవుతోంది. దీంతో లివర్ దెబ్బ తింటోంది.
ప్రస్తుతం చాలా మంది తీసుకుంటున్న జంక్ ఫుడ్ వల్ల లివర్ పనితీరు మందగిస్తోంది. అలాగే మద్యం కూడా విపరీతంగా తాగుతున్నారు. దీని వల్ల లివర్ మరింత డ్యామేజ్ అవుతోంది. ఈ క్రమంలోనే లివర్‌లో విష పదార్థాలు, కొవ్వులు పేరుకుపోతున్నాయి. ఇవి లివర్ వ్యాధులకు కారణమవుతున్నాయి. దీని వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు వస్తున్నాయి. కొందరికి ఇది ప్రాణాంతకంగా మారుతుంది కూడా.
అయితే ఇలాంటి దుష్పరిణామాల బారిన పడకుండా ఉండాలంటే అందుకు లివర్‌ను క్లీన్ చేసుకోవాలి. దీనికి గాను నిమ్మ గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా మనం నిమ్మరసాన్ని పిండినప్పుడు అందులో ఉండే గింజలను పడేస్తుంటాం. అవి పళ్ల కింద పడితే చేదుగా అనిపిస్తాయి. అందువల్ల వాటిని తినేందుకు ఇష్టపడరు. కానీ నిమ్మగింజలను తినడం వల్ల లివర్ క్లీన్ అవుతుందని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. వీటిల్లో ఆల్కలాయిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి లివర్ ఎంజైమ్స్ ఉత్పత్తికి సహాయ పడతాయి. దీని వల్ల లివర్‌లో పలు రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి జరుగుతుంది. ఫలితంగా లివర్ యాక్టివ్‌గా మారుతుంది. అప్పుడు లివర్ తనలో ఉన్న విష పదార్థాలు, కొవ్వును వేగంగా బయటకు పంపిస్తుంది. దీంతో లివర్ క్లీన్ అవుతుంది.
ఇలా నిమ్మ గింజలతో మనం లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. దీని వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ వ్యాధులు ఉన్నవారికి ఈ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ గింజలను తినడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. అయితే నిమ్మ గింజలను రోజూ 4 చొప్పున ఏదో ఒక సమయంలో తిన్నా చాలు. లేదంటే భోజనం చేసేటప్పుడు అన్నంలో పెట్టుకుని కూడా తినవచ్చు. చేదుగా ఉన్నాయని వాటిని పడేయకండి. వాటితో ఎంతో గొప్ప మేలు జరుగుతుంది. కనుక రోజూ వాటిని తినడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.