Liver Clean Tips : మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. ఇది శరీరంలో కీలకమైన విధులను కాలేయం నిర్వర్తిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, మానసిక ఒత్తిడి, మద్యపానం వంటి అలవాట్లు కాలేయం మీద తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తున్నాయి. కాలేయం పనితీరు దెబ్బతినడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఇంటి చిట్కాలను వాడడం వల్ల కాలేయంలోని వ్యర్థాలను తొలగిపోవడంతో పాటుకాలేయ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
కాలేయ పనితీరును మెరుగుపరచడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లి ఉండే ఎంజైమ్ లు కాలేయంలోని వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడతాయి. వెల్లుల్లిని వాడడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ట్రై గ్లిజరాయిడ్స్ కూడా అదుపులో ఉంటాయి. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి వీలైనంత ఎక్కువగా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఇక కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో గ్రీన్ టీ ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతిరోజూ గ్రీన్ టీ ని తాగడం వల్ల కాలేయంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.
అయితే రోజూ 2 లేదా 3 కప్పుల కంటే ఎక్కువగా ఈ గ్రీన్ టీ ని తీసుకోకూడదు. కాలేయంలోని వ్యర్థాలను తొలగించడంలో పసుపు మనకు ఎంతో సహాయపడుతుంది. పసుపును వాడడం వల్ల శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయి. పసుపును వాడడం వల్ల మనం అనేక ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కాలేయ సమస్యలతో బాధపడే వారు ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ పసుపును వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి.
ఇలా తయారు చేసుకున్న పసుపు నీటిని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయంలోని వ్యర్థాలు తొలగిపోయి కాలేయం చక్కగా పని చేస్తుంది. ఈ చిట్కాలను వాడడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. కాలేయం పనితీరు వేగవంతం అవుతుంది. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.