నిత్యం మనం తినే అనేక రకాల ఆహార పదార్థాల ద్వారా శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలు, వ్యర్థాలను లివర్ బయటకు పంపుతుంది. ఈ క్రమంలో లివర్ ఫ్రీ ర్యాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మన శరీరానికి హాని కలిగించడమే కాక.. పలు అనారోగ్య సమస్యలను కూడా కలగజేస్తాయి. లివర్ ఆరోగ్యం కూడా నశిస్తుంది. కనుక ఫ్రీ ర్యాడికల్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే.. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి. అవి లేకపోతే లివర్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఎప్పటికప్పుడు అవి తిరుగుతూ ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ఈ క్రమంలో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్ శుభ్రం కూడా అవుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆ ఆహారాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్‌లో బీటాలెయిన్స్, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు అనబడే యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి. నిత్యం 1 గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. వారంలో కనీసం 2, 3 రోజుల పాటు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే చాలు.. లివర్ శుభ్రమవుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది.
వీటిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లివర్‌లో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తాయి. దీంతో లివర్ శుభ్రమవుతుంది. లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వారంలో కనీసం 2 సార్లు ఈ ఆహారాలను తినడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఉసిరికాయ జ్యూస్ లివర్‌కు సహజసిద్ధమైన టానిక్‌లా పనిచేస్తుంది. దీన్ని ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి లివర్‌ను శుభ్రపరుస్తాయి. నిత్యం ఉసిరికాయ జ్యూస్ తాగడం లేదా 1 నుంచి 3 గ్రాముల ఉసిరి కాయ పౌడర్‌ను తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
లివర్‌ను శుభ్రం చేయడంలో ద్రాక్షలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నిత్యం ఒక కప్పు ద్రాక్షలను తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
బాదం, పిస్తా, వాల్‌నట్స్‌లో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. 6 నెలల పాటు నిరంతరాయంగా నట్స్‌ను తినడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చని సైంటిస్టుల అధ్యయనాలు చెబుతున్నాయి. నిత్యం ఒక గుప్పెడు నట్స్‌ను తింటే లివర్ శుభ్రమవడంతోపాటు లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఆలివ్ ఆయిల్‌ను నిత్యం తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆలివ్ ఆయిల్‌ను నిత్యం 1 టీస్పూన్ మోతాదులో తీసుకున్నా చాలు లివర్ శుభ్రమవుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
అల్లం వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అంతేకాదు, అల్లం తింటే లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో ఉండే జింజరాల్స్, షోగోల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. లివర్‌లో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తాయి. నిత్యం 4 గ్రాముల అల్లం తీసుకున్నా లేదా అల్లం రసం తాగినా కొద్ది రోజుల్లోనే లివర్ శుభ్రమవుతుంది. లివర్ సురక్షితంగా ఉంటుంది.
ఈ రెండు ఆహారాలు లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వీటిల్లో ఫ్లేవనాయిడ్లు అనబడే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్‌ను శుభ్రం చేస్తాయి. నిత్యం పచ్చి వెల్లుల్లి రెబ్బలు 2, 3 లేదా పచ్చి ఉల్లిపాయలు 50 గ్రాములు తినడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
లివర్‌ను శుభ్ర పరచడంలో పసుపు అత్యుత్తమంగా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. పసుపును నిత్యం 1.5 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకుంటే లివర్ శుభ్రమవుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.