Black Tea Benefits : బ్లాక్ టీ, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లాక్ టీ ని తీసుకోవడం వలన ఎన్నో లాభాలని పొందవచ్చు. బ్లాక్ టీ ని తీసుకోవడం వలన, ఏఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు…?, ఎలాంటి ప్రయోజనాలని పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ టీ ని తీసుకోవడం వలన, బరువు తగ్గొచ్చు. చాలామంది అధిక బరువు సమస్యతో, బాధపడుతున్నారు. బ్లాక్ టీ ని తీసుకోవడం వలన, ఈజీగా బరువు తగ్గడానికి అవుతుంది. బ్లాక్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ని తొలగించడానికి, బ్లాక్ టీ బాగా సహాయపడుతుంది.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా బ్లాక్ టీ తగ్గిస్తుంది. బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రిఎంట్స్ శరీరంలో టాక్సిన్స్ ని తొలగించడానికి, బాగా హెల్ప్ అవుతాయి. చర్మానికి కూడా బ్లాక్ టీ ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ టీ లో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలా, బ్లాక్ టీ ని తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
బ్లాక్ టీ ని తీసుకుంటే, మనం శక్తిని కూడా పెంచుకోవచ్చు. అలానే, దృష్టిని కూడా బ్లాక్ టీ మెరుగుపరుస్తుంది. బ్లాక్ టీ ని తీసుకుంటే, ఆరోగ్యానికి ఇన్ని లాభాలు కలుగుతాయి. అయితే, లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వలన నష్టాలు తప్పవు.
బరువు తగ్గాలని అనుకునే వాళ్లు, రోజుకి మూడు నుండి ఐదు కప్పుల బ్లాక్ టీ తీసుకో వచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా బ్లాక్ టీ ఉపయోగపడుతుంది. అల్పాహారం, భోజనం చేసిన అరగంట తర్వాత, ఒక కప్పు బ్లాక్ టీ ని తాగితే మంచిది. బ్లాక్ టీ లో అత్యధిక మొత్తంలో కేఫిన్ ఉండడం వలన, బరువు తగ్గడానికి అవుతుంది. ఇలా ఈ ప్రయోజనాలన్నీ, మనం బ్లాక్ టీ తో పొందవచ్చు.