సాధారణంగా చాలా మంది నారింజ, నిమ్మ పండ్లను తిని వాటిపై ఉండే తొక్కను పడేస్తుంటారు. కానీ నిజానికి ఆయా పండ్ల తొక్కలతోనూ మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా నిమ్మకాయలు ప్రతి ఇంట్లో కామన్. ఎందుకంటే… రోజూ ఏదో ఒక అవసరానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. నిమ్మకాయల్ని రసం పిండేశాక తొక్కల్ని పారేస్తున్నాం.
ఎందుకంటే ఆ తొక్కలతో కలిగే ప్రయోజనాలు మనకు తెలియవు కాబట్టి. వాస్తవానికి నిమ్మకాయ తొక్కల్లో చాలా పోషకాలుంటాయి. నిమ్మకాయ తొక్కల్లో ఉండే D లైమొనెన్ అనే పదార్థం గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించగలవని పరిశోధనల్లో తేలింది.
నిమ్మకాయ తొక్కల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తోంది. మన లివర్‌లో బైల్ యాసిడ్స్ బాగా రిలీజయ్యేలా చేస్తుంది. అది కొలెస్ట్రాల్ అంతు చూస్తుంది. ద్రాక్ష పళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కంటే నిమ్మకాయ తొక్కల్లోనే ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయట. అలాగే నిమ్మతొక్కలను నీటిలో కలుపుకుని స్నానం చేస్తే శరీరం కాంతివంతంగా ఉంటుంది. ఇక నిమ్మకాయ తొక్కను పీల్చితే చాలు ఆ వాసన వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ కలుగుతుంది. సో.. ఇన్ని ఉపయోగాలు ఉన్న నిమ్మతొక్కలను వేస్ట్ చేయకండి సుమీ..!