వేరుశెనగలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో పలు వంటకాలు చేసుకుంటారు. తీపి, కారం రెండు రకాల వంటకాల్లోనూ వేరుశెనగలను ఉపయోగిస్తారు. అయితే వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మన శరీరానికి అవసరమే. ఈ క్రమంలోనే వేరుశెనగలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేరుశెనగల్లో అనేక రకాల శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. రిస్వరెట్రాల్, ఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్స్, ఆర్గైనైన్, ఫైటో స్టెరాల్స్ ఉంటాయి. ఇవి పోషణను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
2. వేరుశెనగలను రోజూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. 2013లో పలువురు సైంటిస్టులు ఈ అంశంపై అధ్యయనం చేపట్టారు. రోజూ వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుందని, అధిక బరువు తగ్గుతారని తేల్చారు. అందువల్ల వీటిని తింటే అధిక బరువు తగ్గుతారు.
3. వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
4. వేరుశెనగల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి ఉపయోగపడతాయి. శక్తిని అందిస్తాయి. కణాలను మరమ్మత్తు చేస్తాయి.
5. వేరుశెనగలను రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
6. వేరుశెనగల్లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు వయస్సు మీద పడే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.
వేరుశెనగలను తినడం వల్ల కొందరిలో అలర్జీలు వస్తాయి. కనుక అలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి. ఇక మిగిలిన ఎవరైనా సరే వేరుశెనగలను రోజూ తినవచ్చు.