కాల్షియం లోపంతోపాటు వృద్ధాప్యం వల్ల చాలా మందికి కీళ్ల నొప్పులు వస్తుంటాయి. ఇది సహజమే. దీంతోపాటు నిత్యం కూర్చుని పనిచేసేవారికి కూడా ఈ తరహా నొప్పులు వస్తుంటాయి. దీంతో కీళ్లలో నొప్పి, మంట వస్తాయి. అయితే ఈ నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు గాను బొడ్డులో నూనెను వేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అయిన మెడి365 సీఈవో శ్రేయాన్ష్ జైన్ నాభి చికిత్స గురించి వివరించారు. బొడ్డులో భిన్న రకాల నూనెలను వేసి మసాజ్ చేయడం వల్ల పలు రకాల రోగాలను నయం చేయవచ్చని తెలిపారు. ఆయుర్వేద ప్రకారం నాభి అనేది చైతన్యం యొక్క ప్రధాన భాగం. అక్కడ చాలా శక్తి ఉంటుంది. బొడ్డు మన శరీరంలో 72వేల సిరల ద్వారా ప్రతి అవయవానికి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల బొడ్డులో నూనె వేసి చికిత్స చేస్తే నరాల చివరలు ఉత్తేజంగా మారుతాయి. దీంతో ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందువల్ల ప్రతి రోజూ బొడ్డులో నూనె వేసి కొంత సేపు మర్దనా చేయడం మంచిది. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.
నాభి చికిత్స కోసం పలు రకాల నూనెలను ఉపయోగిస్తారు. వాటితో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందువల్ల ఏ నూనెను బొడ్డులో వేసి మర్దనా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వులలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ గింజలను క్వీన్ ఆఫ్ సీడ్స్ అని పిలుస్తారు. నువ్వుల నూనెలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల నువ్వుల నూనె శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ నూనెలో బలమైన శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. మసాజ్ కోసం నాభిలో ఈ నూనెను ఉపయోగించినప్పుడు కీళ్ళు, కండరాలలో ఉండే దీర్ఘకాలిక నొప్పి తగ్గుతుంది. అనేక అధ్యయనాలలో నువ్వుల నూనె ఆస్టియో ఆర్థరైటిస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు. అందువల్ల బొడ్డులో నువ్వుల నూనెను వేసి మర్దనా చేస్తే కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.
ఆసియాలో అనేక దేశాల వాసులు తమ వంటకాల్లో ఈ నూనెను విస్తృతంగా వాడుతారు. ఆవ నూనె కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని బొడ్డులో వేసి మర్దనా చేయవచ్చు. ఈ నూనెలో అల్లైల్ ఐసోథియోసైనేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని కొన్ని నొప్పి గ్రాహకాలను డీసెన్సిటైజ్ చేస్తుంది. తద్వారా కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ నూనెలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) కూడా ఉంటాయి. ఇవి మంటలు, వాపులను తగ్గిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి.
ఆలివ్ ఆయిల్ ను బొడ్డులో వేసి మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాక ఆలివ్ నూనెలో అధిక మొత్తంలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
ఆముదం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది కీళ్ల నొప్పులతో సహా పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఈ నూనెను బొడ్డులో వేసి మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, నరాల మంట, గొంతు కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి.
బొడ్డులో నూనె వేసి మసాజ్ చేయడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. సంతాన లోపం మహిళలకు ఆ సమస్య తొలగిపోతుంది. మహిళలకు రుతు సమయంలో ఉండే నొప్పులు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు, మొటిమలు, అధిక బరువు, కీళ్ల నొప్పులు.. వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
గమనిక: నాభిలో సున్నితమైన మసాజ్ చేయడానికి 2-3 చుక్కల నూనెను మాత్రమే ఉపయోగించాలి. బొడ్డును చాలా గట్టిగా నొక్కవద్దు. నూనెను వేశాక సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల పాటు మసాజ్ చేస్తే చాలు. వారంలో రెండు సార్లు ఇలా బొడ్డులో నూనె వేసి మసాజ్ చేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.