Mudda Karpuram For Pains : కర్పూరంలో ముద్ద కర్పూరం వైద్యానికి చాలా చక్కగా పనికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని వెలిగించినప్పుడు వచ్చే వాసన, గాలి పీల్చడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చాలా మంది ఈ ముద్ద కర్పూరం వాసనన ఇష్టపడతారు. దేవాలయాల్లో, ఇంట్లో దేవుడికి హారతి ఇవ్వడానికి ఈ కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ముద్ద కర్పూరాన్ని ఉపయోగించి మనం శరీరంలో వచ్చే నొప్పులను తగ్గించుకోవచ్చని ముద్ద కర్పూరం నొప్పులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా కనుగొన్నారు. 2009 వ సంవత్సరంలో చైనా అకాడమీ ఆఫ్ చైనీస్ మెడికల్ సైన్సెస్ బీజింగ్, చైనా వారు జరిపిన పరిశోధనల్లో ముద్ద కర్పూరం నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుందని తేలింది.
ఆవ నూనెలో ముద్ద కర్పూరాన్ని వేసి కరిగించాలి. కర్పూరం కరిగిన తరువాత ఆ నూనెను చర్మం పై నొప్పులు ఉన్న చోట రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కర్పూరం చర్మం ద్వారా లోపలికి వెళ్లి చల్లదనాన్ని కలిగిస్తుంది. నొప్పికి కారణమయ్యే కణజాలాన్ని శాంతింపజేసి నొప్పిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరిలో కీళ్లల్లో ఇన్ ప్లామేషన్ ఉంటుంది. ఈ ఇన్ ప్లామేషన్ కారణంగా టి ఎన్ ఎఫ్ అల్ఫా, ఐ ఎల్ 2, ఐ ఎల్ 6 అనే రసాయనాలు విడుదల అవుతాయి. ఈ రసాయనాలు కీళ్లల్లో ఇన్ ప్లామేషన్ ను మరింత పెంచుతాయి. దీంతో నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. నొప్పులకు కారణమయ్యే ఈ రసాయనాలను కర్పూరం నిరోధిస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కండరాల నొప్పులు, అలసట వల్ల కలిగే నొప్పులు, దెబ్బల కారణంగా వచ్చే నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇన్ ప్లామేషన్ కారణంగా వచ్చే నొప్పులు ఇలా ఎటువంటి నొప్పైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ముద్ద కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ముద్ద కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల సహజసిద్దంగా మనం నొప్పులను తగ్గించుకోవచ్చని అలాగే దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి వాటి నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల నొప్పి తగ్గినప్పటికి వీటి వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయి. ఈ పెయిన్ కిల్లర్ లను వాడడానికి బదులుగా ఇలా సహజ సిద్దంగా లభించే ముద్ద కర్పూరాన్ని వాడడం వల్ల నొప్పులు తగ్గడంతో పాటు ఎటువంటి చెడు ఫలితాలు కూడా ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.