హెల్త్ టిప్స్

Nerves Weakness : ప‌టిక బెల్లం, మిరియాల‌తో ఇలా చేస్తే చాలు.. న‌రాల బ‌ల‌హీన‌త ఉండ‌దు..!

Nerves Weakness : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యకరమైన చిట్కాలని పాటిస్తూ ఉంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. నరాల బలహీనత సమస్యతో కూడా, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. నరాల బలహీనత అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్య ఉంటే కాళ్లు చేతులు వణికిపోవడం, మాట్లాడే క్రమంలో కళ్ళ నుండి నీళ్లు కారడం, ఎప్పుడైనా అనుకొని సంఘటనని చూసినా, విన్నా గుండె దడ రావడం, బరువు లేని వస్తువుల్ని మోయడం కూడా కష్టంగా అనిపించడం, ఇలా ఈ సమస్య ఉన్న వాళ్ళలో కలుగుతూ ఉంటాయి.

ఏమైనా రాయాలంటే కూడా చేతులు వణికిపోతూ ఉంటాయి. ఇలా, పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక తొందరగా అలిసిపోతుంటారు. వయసు పెరిగే కొద్దీ నరాల బలహీనత సమస్య వస్తూ ఉంటుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే, ఈ సమస్య నుండి బయట పడిపోవచ్చు.

Nerves Weakness use patika bellam and black pepperNerves Weakness use patika bellam and black pepper

సాధారణంగా నరాల బలహీనత రాగానే, చాలామంది టాబ్లెట్లు లేదంటే రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఇంట్లోనే ఇలా మనం ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు. ఈ పొడిని తీసుకుంటే, ఈ సమస్య తగ్గిపోతుంది. ఒక మిక్సీ జార్లో ఐదు స్పూన్లు పుచ్చకాయ గింజలు వేయండి. అలానే ఐదు స్పూన్లు అవిసె గింజల్ని వేయండి.

రెండు బిర్యాని ఆకుల్ని వేసేయండి. దాల్చిన చెక్క, మిరియాలు, 10 వాల్నట్స్, 3 చిన్న పటిక బెల్లం ముక్కలు వేసుకోండి. మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని ఫ్రిజ్లో పెట్టుకుంటే, 15 రోజులు వరకు నిల్వ ఉంటుంది. పాడైపోదు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదంటే నీళ్లల్లో అర స్పూన్ పొడి కలిపి తాగితే సరిపోతుంది. నరాల బలహీనత ఈజీగా తగ్గిపోతుంది.

Admin

Recent Posts