నెయ్యిని చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం అని భావిస్తారు. అందుకే కొందరు దాన్ని తీసుకునేందుకు ఇష్టపడరు. అయితే ఆయుర్వేద ప్రకారం నెయ్యి ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. నెయ్యి వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 1 లేదా 2 టీస్పూన్ల నెయ్యి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
* నెయ్యిని నిత్యం తాగడం వల్ల మన శరీరంలోని చిన్న పేగులు మనం తిన్న ఆహారంలోని పోషకాలను మరింత సమర్థవంతంగా శోషించుకుంటాయి.
* నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
* ఆవు నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి.
* నెయ్యిని తరచూ తీసుకోవడం వల్ల వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు సమస్యలు తగ్గుతాయి.
నెయ్యి మన శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. నెయ్యిలో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కె లు శరీర రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. చర్మం, వెంట్రుకలను సంరక్షిస్తాయి. కీళ్లను దృఢంగా మారుస్తాయి. ఎముకల సమస్యలు రాకుండా ఉంటాయి.
నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ నిత్యం 1 లేదా 2 టీస్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటే బరువు తగ్గుతారని ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యి వల్ల శరీరంలో కరగకుండా మొండిగా పేరుకుపోయి ఉండే కొవ్వు కరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది.
* శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అయితే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఆవు నెయ్యి కలుపుకుని తాగాలి. దీంతో పొడి దగ్గు కూడా తగ్గుతుంది.
* నెయ్యిని నిత్యం తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో రక్త సరఫరా మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.