Numbness : మన జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లల్లో వచ్చిన మార్పులు అలాగే గంటల కొద్ది ఒకే దగ్గర కూర్చొని పని చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం కూడా ఒకటి. ఈ సమస్య ప్రస్తుత కాలంలో సర్వసాధారణమై పోయింది. పెద్ద వారితో పాటు నడి వయస్కులు, యువతరం కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. తిమ్మిర్లు పట్టడాన్ని ఒక సాధారణ సమస్యగా అస్సలు తీసుకోకూడుదు. సూదులతో గుచ్చినట్టు, కాళ్లు చేతులు లాగినట్టు ఒక రకమైన వర్ణించరాని బాధను అనుభవించే వారు నేటి తరుణంలో ఎక్కువవుతున్నారు. ఈ సమస్యను తిమిర్లుగా చెప్పవచ్చు. ఈ రకమైన తిమ్మిర్లు మన శరీరంలో వచ్చే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతంగా భావించాలి. అసలు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి.. వీటిని ఎలా తగ్గించుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో ఉండే నరాలపై ఒత్తిడి పడడం వల్ల ఆ ప్రదేశంలో రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. దీంతో కాళ్లు, చేతులు తిమ్మిర్లు వచ్చి, స్పర్శ లేకుండా మొద్దు బారిపోతాయి. ఎక్కువ సేపు కదలకుండా, ఒకే దగ్గర, ఒకే ఉష్ణోగ్రతలో కూర్చుని ఉన్న, రక్తప్రసరణ వ్యవస్థలో సమస్యలు వచ్చిన, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నా, మూత్రపిండాల సమస్యలు ఉన్నా, అధిక బరువుతో ఉన్నా, శరీరంలో క్యాల్షియం లోపించిన కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. అలాగే శరీరంలో విటమిన్ బి 12, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు లోపించినా కూడా ఈ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. మన శరీరంలో నాడీ మండల వ్యవస్థ చురుకుగా పని చేయాలన్నా, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్న ఈ విటమిన్ బి 12 మనకు ఎంతో అవసరం.
ఈ విటమిన్ కనుక లోపిస్తే తిమ్మిర్ల సమస్యతో పాటు నరాలకు సంబంధించిన ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మన శరీరంలో నరాల మీద మైలింగ్ అనే ఒక పొర ఉంటుంది. శరీరంలో విటమిన్ బి 12 లోపించడం వల్ల ఈ పొర బలహీనపడి నరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాలు దెబ్బతింటాయి. అలాగే రక్తప్రసరణ వ్యవస్థ కూడా నెమ్మదిస్తుంది. దీంతో మన శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించదు. దీని వల్ల కాళ్లు, చేతులతో పాట శరీరంలో ఇతర అవయవాలు కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఈ విటమిన్ బి12 అనేది నీటిలో కరిగే విటమిన్. మన శరీరానికి అవసరమయ్యే దాన్ని కంటే ఎక్కువగా ఈ విటమిన్ ను తీసుకుంటే ఎక్కువగా ఉన్న విటమిన్ మూత్రం లేదా చెమట ద్వారా బయటకు పోతుంది. కనుక ఈ విటమిన్ ను మనం ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. తగినంత విటమిన్ బి 12 ను తీసుకోకపోతే నరాలకు సంబంధించిన ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.
మనం ఈ విటమిన్ ను తీసుకుంటున్నప్పటికి మన శరీరం దీనిని గ్రహించకపోతే ఈ విటమిన్ మూత్రం, మలం ద్వారా బయటకు పోతుంది. దీంతో నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం ముందుగా మన కాళ్లు, చేతులను ధృడంగా మార్చుకోవాలి. కాళ్లు, చేతులను ధృడంగా మార్చడంలో మనకు ఆపిల్ సైడ్ వెనిగర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కాళ్లు, చేతులు ధృడంగా మారుతాయి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రోజూ ఉదయం పరగడుపున ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఆపిల్ సైడ్ వెనిగర్ ను కలిపి తీసుకోవాలి. అలాగే సాయంత్రం కూడా మరోసారి దీనిని తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఆపిల్ సైడ్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే మన శరీరానికి విటమిన్ బి 12 ను అందించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ విమటిన్ బి 12 అనేది మనకు ఎక్కువగా మాంసాహారం ద్వారా అందుతుంది. అలాగే పాలు, పాల ఉత్పత్తులు ద్వారా కూడా మనం ఈ విటమిన్ బి 12 ను పొందవచ్చు. అలాగే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను, పప్పు దినుసులను, తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వాకింగ్, స్ట్రెచ్చింగ్ వంటి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా తిమ్మిర్లు తగ్గుతాయి. అలాగే శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండా తగినన్ని నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కడా మనం తిమ్మిర్ల సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజూ నీటిలో ఎప్సమ్ ఉప్పును కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఉప్పులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలకు ఉపశమనాన్ని అందిస్తుంది. కనుక వారానికి ఒకసారైనా ఈ ఉప్పును నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. తిమ్మిర్ల సమస్యతో బాధపడేవారు ఈచిట్కాలను పాటించడం వల్ల సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.