Nutmeg Milk : జాజికాయ పొడిని పాల‌లో క‌లిపి రాత్రి పూట తాగండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Nutmeg Milk : మ‌న ఇంట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒక‌టి. జాజికాయ‌ను ఎంతో కాలంగా మ‌నం వంటల్లో వాడుతున్నాము. మ‌సాలా వంట‌కాల్లో జాజికాయ‌ను లేదా జాజికాయ పొడి వేయ‌డం వ‌ల్ల అవి మరింత రుచిగా త‌యార‌వుతాయి. వంట‌లకు రుచి ఇవ్వ‌డంతో పాటు జాజికాయ‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ముఖ్యంగా జాజికాయ పాల‌ను రాత్రి పూట తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. జాజికాయ పాలు వీటినే జైఫాల్ దూద్ అని కూడా అంటారు. ఈ పాల‌ను రాత్రి పూట తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి నిద్ర‌తో పాటు అనేక ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. రాత్రిపూట జాజికాయ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. జాజికాయ‌లో మ‌న‌స్సును, శ‌రీరాన్ని శాంత‌ప‌రిచే గుణాలు ఉంటాయి. జాజికాయ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌సుకు చ‌క్క‌టి విశ్రాంతి క‌లుగుతుంది.

నిద్ర‌కు కూడా ఈ పాలు మ‌న‌ల్ని సిద్దం చేస్తాయి. జాజికాయ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల నాణ్య‌మైన‌, లోతైన నిద్ర‌ను మ‌నం సొంతం చేసుకోవ‌చ్చు. నిద్ర చ‌క్రాల‌ను ప్రోత‌హించ‌డంలో జాజికాయ పాలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. జాజికాయ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఒత్తిడిని, ఆందోళ‌నల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని అందించ‌డంలో ఈ పాలు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే జాజికాయ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. రాత్రిపూట జాజికాయ పాల‌ను తాగి ప‌డుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌లో ఉండే అసౌక‌ర్యం త‌గ్గి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. అంతేకాకుండా జాజికాయ పాల‌ను తీసుకోవడం వ‌ల్ల మెద‌డు చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, అభిజ్ఞాప‌నితీరు మెరుగుప‌డుతుంది. అలాగే నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రోజూ జాజికాయ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క్ర‌మంగా నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. అంతేకాకుండా జాజికాయ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్పెక్ష‌న్ లు, అనారోగ్య స‌మ‌స్య‌లు త్వ‌ర‌గా మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Nutmeg Milk many wonderful health benefits
Nutmeg Milk

జాజికాయ‌లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. జాజికాయ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంట‌, వాపు త‌గ్గుతాయి. శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా జాజికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. జాజికాయ‌పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క్యాల్షియం, మెగ్నీషియం, విట‌మిన్స్ వంటి పోష‌కాలు కూడా శ‌రీరానికి అందుతాయి. ఇవి శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా జాజికాయ పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని రాత్రి పూట తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి నిద్ర‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జాజికాయ పాల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా జాజికాయ‌ను గోరువెచ్చ‌ని నీటిలో నాన‌బెట్టాలి. త‌రువాత ఈ జాజికాయ‌ను బండ మీద రాస్తూ మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ చిటికెడు మొత్తంలో తీసుకుని గోరు వెచ్చని పాల‌ల్లో క‌లిపి తీసుకోవాలి. ఇందులో తేనెను కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు. ఈ విధంగా జాజికాయ పాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts