Oats For Weight Loss : ఓట్స్.. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఇది కూడా ఒకటి. ఓట్స్ ను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వీటిలో ఉండే ఫైబర్ మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఇవి బరువు తగ్గడంలో మనకు సహాయపడతాయి. అయితే ఓట్స్ లో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఒక్కో పద్దతిలో తయారు చేస్తారు. అలాగే ఒక్కో రకమైన ఓట్స్ ఒక్కో గుణాన్ని కలిగి ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు సరైన ఓట్స్ ను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఓట్స్ లో ఉండే రకాలు, వాటిని ఏ విధంగా తయారు చేస్తారు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టీల్ కట్ ఓట్స్.. అత్యంత ఆరోగ్యకరమైన ఓట్స్ లో ఇవి కూడా ఒకటి. ఈ రకం ఓట్స్ ను అస్సలు శుద్ది చేయరు. ఈ పద్దతిలో ఓట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఈ స్టీట్ కట్ ఓట్స్ మందంగా ఉండడంతో పాటు ఎక్కువగా నమలాల్సి వస్తుంది. దీంతో మనకు ఓట్స్ తిన్న అనుభూతి కలుగుతుంది. అలాగే వీటిని వండడానికి కూడా ఎక్కువగా సమయం పడుతుంది. కనుక వీటిలో ఉండే పోషకాలు నశించకుండా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.
రోల్డ్ ఓట్స్.. ఈ రోల్డ్ ఓట్స్ ను పాతం కాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. వీటిని ఆవిరి ఉడికించి ఆ తరువాత రోలర్స్ లో వేసి చదును చేస్తారు. ఇవి చూడడానికి ఇన్ స్టాంట్ ఓట్స్ మాదిరి ఉంటాయి. అలాగే ఈ రోల్డ్ ఓట్స్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉండవు. ఈ ఓట్స్ తో కూడా మనం రకరకాల ఆహార పదార్థాలను వండుకుని తినవచ్చు. అయితే ఈ రోల్డ్ ఓట్స్ లో మాత్రం ఆశించదగిన స్థాయిలో మాత్రం పోషకాలు ఉండవు.
ఇన్ స్టాంట్ ఓట్స్.. ఇన్ స్టాంట్ ఓట్స్ తో మనం 10 నిమిషాల్లోనే బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకోవచ్చు. వీటిని ముందుగా ఉడికించి ఆ తరువాత త్వరగా ఉడకడానికి డీహైడ్రేట్ చేస్తారు. అయితే ఈ ఓట్స్ కు ఆర్టిఫిషియల్ షుగర్స్ ను జతచేసి అమ్ముతూ ఉంటారు. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి సరైనవి కావని చెప్పవచ్చు. శుద్ది చేసిన ఆహారాలను తీసుకోవడం మంచిది కానప్పటికి వీటికి ప్రత్యామ్నాయంగా చక్కెర లేని ఇన్ స్టాంట్ ఓట్స్ ను తీసుకోవడం మంచిది.
ఓట్ బ్రాన్.. దీనినే ఓట్స్ ఊక అని అంటారు. ఓట్స్ పైన ఉండే పొర నుండి దీనిని తయారు చేస్తారు. దీనిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బీటా గ్లూకాన్ అనే సాలబుల్ ఫైబర్ దీనిలో ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, పొట్ట నిండిన భావనను కలిగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆహారంలో భాగంగా ఓట్స్ ఊకను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు.
గ్లూటెన్ ఫ్రీ ఓట్స్.. గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ అనే పేరు ఉన్నప్పటికి వీటిని కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించాలి. ఉదర కుహర వ్యాధులతో బాధపడే వారికి గ్లూటెన్ ఫ్రీ ఆహారాలను తీసుకునే వారికి ఇవి చక్కటి ఆహారమని చెప్పవచ్చు. స్టీట్ కట్ ఓట్స్, ఓట్ బ్రాన్, గ్లూటెన్ ఫ్రీ ఓట్స్, రోల్ట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం ఉత్తమం. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఓట్స్ ను తీసుకునేటప్పుడు వీటిలో పంచదార, అధిక క్యాలరీలు ఉండే పదార్థాలను వేసుకోకూడదు. పండ్లు, దాల్చిన చెక్క, తేనె, మాపుల్ సిరప్ వంటి వాటిని మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే ఓట్స్ ను తీసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు.సులభంగా బరువు తగ్గవచ్చు.