Onion And Garlic : మనం వంటల్లో ఉల్లిపాయను అలాగే వెల్లుల్లిని కూడా విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా ఎన్నో ఔషధ గుణాలను, ఆరోగ్య ప్రయోజనాలను దాగి ఉన్నాయి. దాదాపు మనం చేసే ప్రతివంటలోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా అల్లియం కుటుంబానికి చెందినవి. అలాగే ఇవి ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. అయితే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిలో ఏది మన ఆరోగ్యానికి మరింతగా మేలు చేస్తుంది… దేనిని తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి రెండు కూడా మనకు ఎంతగానో సహాయపడతాయి.
ఉల్లిపాయ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. వీటిని తీసుకోవడం వల్ల మనం బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఇవి రెండు కూడా క్యాన్సర్ ని నిరోధించే లక్షణాలను కలిగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాము. అయితే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల వీటితో పాటు గ్యాస్ట్రిక్ మరియు కొలొరెక్టల్ వంటి క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాము. అదే విధంగా ఉల్లిపాయను తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, హైబీపీ, మధుమేహం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన, కడుపులో మంట, గుండెల్లో మంట, గ్యాస్, వికారం, వాంతులు, విరేచనాలు, అలర్జీలు, రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదే ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండవు. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా దేనిని కూడా ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కూడా తగిన మోతాదులో తీసుకున్నప్పుడే వాటి వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను మనం పొందగలమని వారు చెబుతున్నారు.