వివిధ రకాల పోషకాలు, ఖనిజాలు, మైక్రో న్యూట్రియెంట్స్ ఉండే ఆహారాలు తింటే ఎలాంటి అనారోగ్యాలు రావు. ముఖ్యంగా బ్యాలెన్స్‌డ్ డైట్‌లో నట్స్, సీడ్స్ తప్పక ఉండాలి. ఈ లిస్టులో ఉండే చీప్ అండ్ బెస్ట్ నట్స్ వేరుశనగలు. ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌కు బెస్ట్ సోర్స్. కండరాల ఆరోగ్యం, మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్ పల్లీల నుంచి లభిస్తుంది. దీంతో పాటు మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B6, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు వేరుశనగ నుంచి లభిస్తాయి. వేరుశనగలో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు. ఈ HDL కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిది. పీనట్స్‌లో ఉండే విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
అయితే ఇన్ని పోషకాలు ఉన్న వేరుశనగలు అందరికీ పడవు. కొందరు వీటిని తింటే ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. పీనట్ అలర్జీ.. వేరుశనగ తింటే కొందరికి శరీరంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. వివిధ రకాల అలర్జీలు రావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు, దురద వంటి రియాక్షన్స్ వస్తుంటే, పీనట్స్ తినకపోవడమే మంచిది. ఎసిడిటీ సమస్యలు .. ఉన్నవారు ఎప్పుడూ ఎసిడిటీ లేదా గుండెల్లో మంటతో బాధపడేవారు పీనట్స్ తినకూడదు. వేరుశనగ తింటే కొంత మందికి ఉబ్బరం, గ్యాస్ పెరుగుతాయి. దీంతో ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు.. వేరుశనగలో ఆక్సలేట్స్ పుష్కలంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్ ఏర్పడటానికి ఈ సమ్మేళనాలు ప్రధాన కారణం. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు వేరుశనగలు తినకూడదు. లేదంటే ఈ రిస్క్ మరింత పెరగవచ్చు.
యూరిక్ యాసిడ్.. వేరుశనగలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. పీనట్స్‌లో ఉండే ప్యూరిన్స్ కారణంగా యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగి కీళ్ల వాపు, కీళ్ల వాతం రిస్క్ ఎక్కువ అవుతుంది. కీళ్లనొప్పులు ఉన్నవారు.. కీళ్లనొప్పులతో బాధపడుతున్న వ్యక్తులు వేరుశనగలు తినకూడదు. ఎందుకంటే వీటిలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది వాపును మరింత పెంచుతుంది. దీంతో కీళ్లనొప్పి ఎక్కువ అవుతుంది. శిశువులు, చిన్నపిల్లలకు పీనట్ బటర్, వేరుశనగతో చేసిన ఇతర పదార్థాలు పెట్టకూడదు. ఎందుకంటే చిన్నారులకు పీనట్ అలర్జీల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పైగా వారికి ఇవి అరగక, ఇబ్బంది పడవచ్చు. తామర లేదా ఆస్తమా ఉన్న వ్యక్తులకు పీనట్ అలర్జీలు లేదా రియాక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు పల్లీలు తినకపోవడం మంచిది.
ఉప్పు కలిపిన వేరుశనగలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే సాల్టెడ్ పల్లీలు అస్సలు తినకూడదు. పీనట్స్‌లో ఫైబర్ కంటెంట్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పల్లీలు ఎక్కువగా తినేవారికి IBS వంటి జీర్ణ సమస్యల రిస్క్ పెరగవచ్చు. ఇప్పటికే ఏవైనా డైజేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, వీటిని దూరం పెట్టడమే మంచిది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వేరుశనగలు తింటే అలర్జీలు ఎదురుకావచ్చు. అందుకే వైద్యుల సలహాతో, చాలా పరిమితంగా వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.