Phool Makhana Powder : రోజూ ఒక్క స్పూన్ చాలు.. బ‌లం వ‌స్తుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

Phool Makhana Powder : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఈ పొడిని వాడడం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. కంటికి సంబంధించిన స‌మ‌స్యలు రాకుండా ఉంటాయి. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

పిల్ల‌ల‌కు ఈ పొడిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. వారిలో ఎముక‌లు, కండ‌రాలు ధృడంగా త‌యార‌వుతాయి. ఇంత‌కి మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..దీనిని ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక క‌ప్పు ఫూల్ మ‌ఖ‌నాను, పావు క‌ప్పు బాదంప‌ప్పును, పావు క‌ప్పు వాల్ న‌ట్స్ ను, పావు క‌ప్పు ప‌ల్లీల‌ను, పావు క‌ప్పు జీడిప‌ప్పును, మూడు టీ స్పూన్ల సోంపు గింజ‌ల‌ను, మూడు స్పూన్ల పుచ్చ‌గింజ‌ల ప‌ప్పును, ఒక టీ స్పూన్ మిరియాల‌ను, రుచికి త‌గిన‌న్ని ఎండు ఖ‌ర్జూరాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా క‌ళాయిలో జీడిపప్పు, బాదంప‌ప్పు, ప‌ల్లీలు, వాల్ న‌ట్స్, ఫూల్ మ‌ఖ‌నా వేసి దోర‌గా వేయించి గిన్నె లోకి తీసుకోవాలి.

Phool Makhana Powder many amazing health benefits
Phool Makhana Powder

త‌రువాత అదే క‌ళాయిలో మిరియాలు, ఎండు ఖ‌ర్జూరం ముక్క‌లు, సోంపు గింజ‌లు, పుచ్చ‌గింజ‌ల ప‌ప్పు వేసి వేయించాలి. వీటిని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీట‌న్నింటిని మెత్త‌ని పొడిలా మిక్సీ ప‌ట్టుకుని గాలి త‌గ‌ల‌కుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒకేసారి త‌యారు చేసుకుని నెల‌రోజుల పాటు నిల్వ చేసుకోవాలి. అవ‌స‌ర‌మైతే ఇందులో ప‌టిక బెల్లం పొడిని కూడా వేసుకోవ‌చ్చు. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ ఒక టేబుల్ స్పూన్ మోతాదులో గోరు వెచ్చ‌ని పాల‌ల్లో క‌లిపి తీసుకోవాలి. ఇలా ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఈ విధంగా మ‌న ఇంట్లోనే సుల‌భంగా పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు వాటి బారిన ప‌డ‌కుండా కూడా ఉంటాము.

D

Recent Posts