మహిళలకు గర్భదారణ సమయంలో అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. వారు మానసికంగా, శారీరకంగా అనేక మార్పులకు లోనవుతుంటారు. మూడ్‌లో మార్పులు వస్తాయి. ఆహారాలను తినాలనే ఆసక్తి పెరుగుతుంది. హార్మోన్ల సమస్యలు కూడా వస్తాయి. దీంతో వారు సహజంగానే బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, ఊరగాయలు, పాలు, చిప్స్ వంటి వాటిని ఎక్కువగా తింటుంటారు. అయితే గర్భిణీలు ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా చిప్స్‌ను అస్సలు తినరాదు.
గర్భం దాల్చిన మహిళలు తాము తినే ఆహారం ద్వారా లభించే పోషకాలు అయినా సరే, ఇతర సమ్మేళనాలు అయినా సరే గర్భంలో ఉన్న బిడ్డకు పంపుతారు. అందువల్ల వారు తినే ఆహారాన్ని ఆచూ తూచి పరిశీలించి మరీ తినాలి. ఇక చిప్స్ ఎక్కువగా తినే గర్భిణీలు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి.
గర్భ ధారణ సమయంలో మహిళలు సహజంగానే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటుంటారు. వాటిల్లో చిప్స్ ఒకటి. అయితే చిప్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ బాగా పెరిగిపోతాయి. దీంతో గర్భంలో ఉన్న శిశువుల బరువు తగ్గుతుంది. ఈ క్రమంలో వారు తక్కువ బరువుతో జన్మిస్తారు. ఈ విషయం సైంటిస్టుల అధ్యయనంలో తేలింది.
గర్భం సమయంలో చిప్స్‌ను తినడం వల్ల కడుపులో ఉండే చిన్నారి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీని వల్ల శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తారు. సాధారణంగా ఆహార పదార్థాలను బాగా వేడి చేసినప్పుడు లేదా నూనెలో వేయించినప్పుడు వాటిల్లో ఆక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడుతుంది. ఇక చిప్స్, ఇతర జంక్ ఫుడ్‌లో టేస్ట్ కోసం ఎక్కువగా మోనో సోడియం గ్లూటమేట్ (టేస్టింగ్ సాల్ట్)ను కలుపుతుంటారు. నిజానికి ఈ రెండు కెమికల్స్ మనకు ప్రమాదకరమైనవి. ఇవి గర్భిణీలు, వారి శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల గర్భిణీలు చిప్స్ తోపాటు ఇతర జంక్ ఫుడ్‌ను కూడా తినరాదు. సహజసిద్ధమైన ఆహారాలను తినేందుకు యత్నించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు నట్స్ వంటివి తినాలి. దీంతో శిశువు ఆరోగ్యంగా జన్మించేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365