కోడిగుడ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మనకు అందుబాటులో ఉన్న అత్యంత చవక ధర కలిగిన ప్రోటీన్లు ఉండే ఆహారాల్లో గుడ్లు ఒకటి. వీటిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ కోడిగుడ్లను తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అధిక బరువు తగ్గుతారు. గుడ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే రోజూ పరిమిత మోతాదులోనే గుడ్లను తినాలి. అధికంగా తీసుకుంటే హాని కలుగుతుంది. ఈ క్రమంలోనే గుడ్లను ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది కోళ్ల నుంచి వస్తుంది. అందువల్ల గుడ్లను సరిగ్గా ఉడికించి తినాలి. లేదంటే ఆ బాక్టీరియా మన శరీరంపై దాడి చేసి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. కనుక గుడ్లను సరిగ్గా ఉడికించాక మాత్రమే తినాలి. గుడ్లు సరిగ్గా ఉడకకపోతే గ్యాస్, వాంతికి వచ్చినట్లు ఉండడం, జీర్ణ సమస్యలు వస్తాయి.
2. ఇక కోడిగుడ్లను అధికంగా తినడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. గుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల అధిక మోతాదులో గుడ్లను తింటే ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. దీంతో కిడ్నీలపై భారం పడుతుంది.
3. కొందరికి గుడ్లు అంటే పడవు. అలాంటివారు వాటికి దూరంగా ఉండాలి. పరిమిత మోతాదులో గుడ్లను తింటే ఏమీ కాదు. కానీ లిమిట్ దాటితే దుష్పరిణామాలు ఏర్పడుతాయి. రోజుకు 1-2 గుడ్లను తినడం ఓకే. కానీ అంతకు మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల గుడ్లను తినేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
4. ఇక గుడ్లలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. అందువల్ల గుడ్లను అధికంగా తింటే ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
5. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు 3 గుడ్లను తినవచ్చు. కానీ ఒక గుడ్డులోని పచ్చసొనను మాత్రమే తినాలి. మిగిలిన రెండు గుడ్లలో కేవలం తెల్లనిసొనను మాత్రమే తీసుకోవాలి. ఇక అనారోగ్య సమస్యలు ఉన్నవారు రోజుకు 2 గుడ్లను తినవచ్చు. కానీ పచ్చ సొన తీసేసి తింటే మంచిది. దీంతో గుడ్ల వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందుతారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365