Red Banana Benefits : మనకు సంవత్సరమంతా విరివిగా లభించే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. అరటి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. అరటిపండ్లు అందరికి అందుబాటు ధరల్లో లభిస్తూ ఉంటాయి. వీటిలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఎర్ర అరటి పండ్లు కూడా ఒకటి. ఎర్ర అరటిపండ్ల పైతొక్క ఎర్రగా ఉంటుంది. ఈ అరటి పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇతర అరటిపండ్ల వలె ఎర్ర అరటిపండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు దాగగి ఉన్నాయి. ఎర్ర అరటి పండ్లను క్రమం తప్పకుండా 21 రోజుల పాటు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎర్ర అరటిపండ్లను రోజూ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఎర్ర అరటిపండ్లను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దద్దుర్లు, దురద, చర్మం పొడిగా మారడం వంటి లక్షణాలు తగ్గుతాయి. అలాగే ఎర్ర అరటిపండ్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎర్ర అరటిపండ్లను తీసుకోవడం వల్ల సంతాన లేమి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నేటి తరుణంలో చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఎర్ర అరటిపండ్లను రోజూ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు తగ్గుతాయని త్వరగా సంతానం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఎర్ర అరటిపండ్లను తీసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. నరాల సంబంధిత సమస్యలు, మూర్ఛ వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నాడీ మండల వ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఈ విధంగా ఎర్ర అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇతర అరటిపండ్లు వలె వీటిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.