Red Onion For Hair : ఎర్ర ఉల్లిపాయ‌ల‌ను ఇలా ఉప‌యోగించండి.. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది..!

Red Onion For Hair : మ‌నలో చాలా మందిని వేధించే స‌మ‌స్య‌లల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డానికి అనేక ర‌కాల కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి, వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఇలా అనేక కార‌ణాల చేత జుట్టు ఊడిపోతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల షాంపుల‌ను వాడుతూ ఉంటారు. షాంపుల‌ను వాడ‌డం వ‌ల్ల వాటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా జుట్టు మ‌రింత‌గా ఊడిపోతుంది. అలాగే అనేక ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఎలా ఉంటుందో ఎవ‌రికి తెలియ‌దు. అలాగే కొంద‌రు హెయిర్ క్లినిక్ ల‌కు వెళ్లి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు.

అయితే ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం ఒకే ఒక ప‌దార్థాన్ని ఉప‌యోగించి మ‌నం సుల‌భంగా జుట్టు ఊడిపోవ‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. చాలా త‌క్కువ ఖ‌ర్చులో జుట్టు ఊడిపోవ‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టు ఊడిపోవ‌డాన్ని త‌గ్గించే ఒకే ఒక ప‌దార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో ఎర్ర ఉల్లిపాయ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. అలాగే త‌ల‌లో దుర‌ద‌, అకాల బ‌ట్ట‌త‌ల‌, త‌ల‌లో ఇన్పెక్ష‌న్, జుట్టు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. జుట్టు కుదుళ్ల‌ను బ‌లంగా, ఆరోగ్యంగా చేసి జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో ఎర్ర ఉల్లిపాయ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.

Red Onion For Hair  how to use this for many benefits
Red Onion For Hair

దీని కోసం ఎర్ర ఉల్లిపాయ‌ను ముక్క‌లుగా చేసి జార్ లో వేసుకోవాలి. త‌రువాత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని వ‌డ‌క‌ట్టి దాని నుండి ర‌సాన్ని తీసుకోవాలి. త‌రువాత ఈ ఉల్లిపాయ ర‌సాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. ఉల్లిపాయ వాస‌న ప‌డ‌ని వారు దీనిని కొబ్బ‌రి నూనెలో లేదా ముల్తానీ మ‌ట్టితో క‌లిపి జుట్టుకురాసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయ ర‌సాన్ని ప‌ట్టించి అర‌గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల 2 నుండి 3 నెల‌ల్లోనే మ‌నం ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు. ఈ విధంగా ఎర్ర ఉల్లిపాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఒత్తైన‌, అంద‌మైన జుట్టును పొంద‌వ‌చ్చు.

D

Recent Posts