Roasted Peanuts : మనం పల్లీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిని పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటాము. అలాగే వేయించి ఉప్పు, కారం చల్లుకుని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాము. ఉడికించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వివిధ రకాల తీపి వంటకాల్లో కూడా పల్లీలను వాడుతూ ఉంటాము. పల్లీలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. పల్లీలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే పల్లికాయలను లేదా పల్లీలను వేయించి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నూనె వేయకుండా ఉప్పు, కారం వాడకుండా కేవలం వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇలా వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ నశిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల సంతాన లోపాలు తొలగిపోతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఉదయం పూట అల్పాహారంగా వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.