Rose Water Health Benefits : చర్మ సంరక్షణలో భాగంగా ఎంతో కాలంగా మనం రోజ్ వాటర్ ను ఉపయోగిస్తున్నాము. రోజ్ వాటర్ ను వాడడం వల్ల చర్మంపై ఉండే మురికి తొలగిపోవడంతో పాటు చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. రోజ్ వాటర్ ను నేరుగా చర్మానికి రాసుకోవడంతో పాటు వివిధ రకాల ఫేస్ ప్యాక్ లల్లో కూడా దీనిని వాడుతూ ఉంటాము. అయితే కేవలం చర్మం యొక్క అందాన్ని మెరుగుపరచడంలోనే కాకుండా రోజ్ వాటర్ ను వాడడం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని వాడడం వల్ల అనేక రకాల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజ్ వాటర్ ను వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ వాటర్ ను చుక్కల రూపంలో మనం కళ్లల్లో కూడా వేసుకోవచ్చు. రోజ్ వాటర్ ను కళ్లల్లో వేసుకోవడం వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి. అంతేకాకుండా డాక్రియోసైటిక్స్, పేటరీజియం, కళ్లల్లో శుక్లాలు వంటి కంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా రోజ్ వాటర్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. కనుక రోజ్ వాటర్ ను ఉపయోగించి గాయాలను, దెబ్బలను కడగడం వల్ల మంట తగ్గడంతో పాటు గాయాలు కూడా త్వరగా తగ్గుతాయి. అలాగే రోజ్ వాటర్ ను వాడడం వల్ల మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీనిలో ఉండే యాంటీ డిప్రెషన్ గుణాలు ఒత్తిడిని, ఆందోళన వంటి వాటిని తగ్గించడంలో దోహదపడతాయి.
ఈ వాటర్ ను వాడడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఇక రోజ్ వాటర్ లో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. కనుక ఈ రోజ్ వాటర్ ను వాడడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా రోజ్ వాటర్ ను వాడడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వాటర్ ను వాసన చూడడం వల్ల మైగ్రేన్ కూడా తగ్గుతుంది. అలాగే అల్జీమర్స్ కు చేసే చికిత్సలో కూడా రోజ్ వాటర్ చక్కగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా రోజ్ వాటర్ మన అందానికే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఈ వాటర్ ను ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.