Saggubiyyam For Weight : మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటే కొందరూ మాత్రం బరువు తక్కువగా ఉన్నామని చింతిస్తూ ఉంటారు. ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా బరువు ఉండడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడాల్సి వస్తుంది. బరువు తక్కువగా ఉండడం వల్ల తరచూ నీరసం, అలసట, బలహీనత వంటివి శరీరాన్ని ఆవహించినట్టుగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడానికి మార్కెట్ లో లభించే పొడులను, మందులను వాడుతూ ఉంటారు. అలాగే త్వరగా బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను తింటూ ఉంటారు. దీని వల్ల బరువు పెరిగినప్పటికి శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.
దీంతో ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బరువు పెరగాలనుకున్న వారు సహజ సిద్దంగా బరువు పెరగడం చాలా అవసరం. ఒక చక్కటి చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా బరువు పెరగవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. చాలా సులభంగా, ఆరోగ్యవంతంగా బరువు పెరగవచ్చు. సులభంగా బరువును పెంచే ఈ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించాల్సిన పదార్థం మరేమిటో కాదు సగ్గుబియ్యం. సగ్గుబియ్యం మనందరికి తెలిసిందే. ఇది మనకు షాపుల్లో చాలా సులభంగా లభిస్తుంది. రోజూ రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని ఒక గ్లాస్ పాలలో వేసి పాయసం చేసుకుని తీసుకోవాలి. దీనిని రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు పెరగవచ్చు. సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. సగ్గు బియ్యాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలే తప్ప ఎటువంటి హాని కలగదు. ఈ విధంగా బరువు పెరగాలనుకున్న వారు రోజూ సగ్గు బియ్యాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.