Salt On Fruits : పండ్లు తినేట‌ప్పుడు వాటిపై ఉప్పు చ‌ల్లుతుంటారు.. ఇలా తిన‌వ‌చ్చా.. ఏదైనా న‌ష్టం జ‌రుగుతుందా..?

Salt On Fruits : పండ్లు తినేప్పుడు సాధారణంగా చాలామంది కట్ చేసి ఉప్పు చల్లుకుని  తింటారు. ఎక్కువగా పుచ్చకాయ, జామకాయ విషయంలో ఇలా చేస్తారు. కొందరు అన్ని రకాల పండ్లను అలాగే తింటారు. అలా పండ్లు కోసుకుని తినేటప్పుడు వాటి మీద కాస్తంత సన్న ఉప్పు చల్లుకుని తింటే రుచి పెరుగుతుంది. అంతేకాదు దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు చల్లుకుని తినడం కరెక్ట్ కాదు. పండ్ల ముక్కలపై ఉప్పు చల్లడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేయొచ్చు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు. అయితే.. ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే మాత్రం గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Salt On Fruits is it ok to take like that
Salt On Fruits

సిట్రస్ జాతి పండ్ల మీద ఉప్పు చల్లుకుని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు. దీంతో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్టవుతుంది. జామకాయ మీద ఉప్పు చల్లుకుని తింటే దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. నోటిలోని బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అయితే విట‌మిన్ సి అధికంగా ఉండి పుల్ల‌గా ఉండే పండ్లు లేదా కాయ‌ల మీద కాస్త ఉప్పు చ‌ల్లి తిన‌వ‌చ్చు. అది కూడా రోజుకు మ‌నం తినే ఉప్పు మోతాదు మించ‌కుండా ఉండాలి. అలాగైతే పండ్ల మీద నిర‌భ్యంత‌రంగా ఉప్పు చ‌ల్లి తిన‌వ‌చ్చు. అలా కాకుండా కొంద‌రు రోజూ ఉప్పును అధికంగా తింటుంటారు. అలాంటి వారు పండ్ల‌పై ఉప్పును చ‌ల్ల‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే ఉప్పు మోతాదు మించుతుంది. దీంతో అన‌ర్థాలు సంభ‌విస్తాయి. క‌నుక పండ్ల‌పై ఉప్పు చ‌ల్లి తినేవారు రోజువారీ కోటాలో కాస్త ఉప్పును త‌గ్గించి తింటే మంచిది. దీంతో రుచికి రుచి ల‌భిస్తుంది. అలాగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. క‌నుక పండ్ల‌పై ఉప్పు చ‌ల్లి తినేవారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం మంచిది. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఎలాంటి అనర్థాలు క‌ల‌గ‌కుండా ఉంటాయి.

Share
Editor

Recent Posts