హెల్త్ టిప్స్

Sitting On Wallet : ప‌ర్స్‌ను వెనుక జేబులో పెట్టుకుని కూర్చుంటున్నారా.. అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Sitting On Wallet : మనలో చాలామంది తక్కువ వయసులోనే నడుమునొప్పి, వెన్నెముక సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి..? అని పరిశీలించగా మనం ధరించే ప్యాంట్ల వెనుక జేబులలో ఉంచుకునే మనీ పర్స్, ఇతర వస్తువులే కారణమని తేలింది. ఆఫీస్, సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పడు, గంటలు గంటలు ఒకేచోట అలాగే కూర్చున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది మనీ పర్స్, చిన్న చిన్న వస్తువులను వెనుక జేబులో ఉంచుకొని అలాగే గంటల తరబడి కూర్చోవడం వలన, స్థాన భ్రంశం నుండి కదలని కారణంగా పొత్తికడుపు, వెన్నెముక, నడుము నొప్పి సమస్యతో బాధపడవలసి వస్తోంది.

అలా ఒకేచోట మన పర్స్ లేదా వేరే వస్తువులను పెట్టుకొని కూర్చోవడం వలన సరిగ్గా కూర్చేలేం. మన పిరుదులు రెండు సమానంగా ఉండకుండా ఈ వాలెట్ పెద్దదిగా ఉండటంతో ఒకవైపు ఎత్తుగా, మరోవైపు సన్నగా ఉంటుంది. దీని కారణంగా వెంటనే వెన్నెముకపై ఆ బరువు పడుతుంది. అందువలన నడుమునొప్పి, తొడ కండరాలు, నరాలు పట్టి లాగినట్లుగా వాటిపై ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది.

Sitting On Wallet is not good for health

ఇప్పటివరకూ కేవలం తమ మనీపర్స్ లను వెనుక జేబుల్లో ఉంచుకునేవారు. మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటినుండీ వాటిని స్టైల్ గా వెనుక జేబులో పెట్టుకొని ఒకవైపుగా కూర్చోవడం వలన ఇంకా కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే చివరిగా చెప్పేదేమిటంటే.. ఇక నుండి మీ వెనుక జేబులో ఇలా మనీ పర్స్, సెల్ ఫోన్స్, చిన్న చిన్న వస్తువుల‌నుఉంచుకోకుండా ఖాళీగా ఉంచండి. ఈ చిన్న టిప్ గనుక మీరు పాటించినట్లయితే ఇక ఎలాంటి నొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts