వైద్య విజ్ఞానం

Vitamin D Deficiency Symptoms : విటమిన్ డి ఒంట్లో తక్కువ ఉందని.. ఎలా తెలుసుకోవచ్చు..?

Vitamin D Deficiency Symptoms : ఆరోగ్యంగా ఉండడం కోసం అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే, కచ్చితంగా అన్ని రకాల పదార్థాలు ని మనం తీసుకుంటున్నామా..? లేదా..? పోషకాలు అన్నీ అందుతున్నాయా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. విటమిన్ డి కూడా చాలా ముఖ్యం. విటమిన్ డి కూడా ఉండేటట్టు చూసుకోవాలి. విటమిన్ డి ఒంట్లో తక్కువైతే, బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. కండరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే, విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోయినట్లయితే, ఎముకలు కూడా బలహీన పడిపోతాయి.

ఎముకల సమస్యలు కూడా కలుగుతాయి. ఏది ఏమైనా విటమిన్ డి లెవెల్స్ ని పెంచుకోవడం ముఖ్యం. విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అయితే, విటమిన్ డి లెవెల్స్ సరిగ్గానే వున్నాయి అని ఎలా చెప్పచ్చు..? ఈ విషయానికి వస్తే.. విటమిన్ డి ఒంట్లో సరిపడా ఉందా లేదా అనేది, మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే, కచ్చితంగా చెక్ చేయించుకోండి.

how to know vitamin d is low in body

విటమిన్ డి మనకి మూడు రకాలుగా పొందడానికి అవుతుంది. విటమిన్ డి ని చర్మం, డైట్, సప్లిమెంట్స్, ఆధారంగా మనం పొందవచ్చు. సూర్యుడు ద్వారా మనకి విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి, సూర్యకిరణాలు పడేటట్టు ఉదయం పూట వాకింగ్ చేయడం లేదంటే ఎండలో కాసేపు నిలబడడం వంటివి చేయండి.

విటమిన్ డి లోపం ఉన్నట్లయితే, నీరసంగా ఉంటుంది. ఎముకలు నొప్పి, కండరాల బలహీనత, కండరాల నొప్పులు ఇలా కొన్ని సమస్యలు ఉంటాయి. విటమిన్ డి మనకి చేపల్లో ఉంటుంది. పుట్టగొడుగులు, చీజ్, గుడ్డు ద్వారా కూడా లభిస్తుంది. సోయా డ్రింక్స్, ఆరెంజ్ జ్యూస్ ద్వారా కూడా విటమిన్ డి ని మనం పొందవచ్చు.

Admin

Recent Posts