Sleep Mask: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని నిద్రలేమి సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఒత్తిడి, ఆందోళన అనేవి నిద్రలేమి సమస్య వెనుక ఉంటున్న ప్రధాన కారణాలు. వీటివల్లే చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. అయితే అలాంటి వారు స్లీప్ మాస్క్‌లను వాడడం వల్ల నిద్ర సరిగ్గా పడుతుంది. నిద్ర బాగా పోవచ్చు.
స్లీప్ మాస్క్ అనేది కాస్మొటిక్ ప్రొడక్ట్ కాదు. మనం ముఖానికి ధరించే మాస్క్ లాంటిదే. కాకపోతే దీన్ని కళ్లకు ధరించాలి. ఈ మాస్క్ కళ్లను కవర్ చేస్తుంది. దీంతో ఈ మాస్క్ గుండా కాంతి లోపలికి ప్రవేశించదు. కళ్లపై కాంతి పడదు. చీకటిగా ఉంటుంది. దీంతో సులభంగా నిద్రలోకి జారుకోవచ్చు.
చాలా మందికి గదిలో కాంతి ఉంటే నచ్చదు. నిద్రరాదు. అందుకని గదిని చీకటిగా ఉంచి నిద్రిస్తారు. అయితే స్లీప్ మాస్క్‌ను వాడడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది. నిద్ర త్వరగా పడుతుంది.
స్లీప్ మాస్క్ ధరించడం వల్ల చీకటిగా ఉంటుంది కనుక శరీరం మెలటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో నిద్ర పడుతుంది. స్లీప్ మాస్క్ వెనుక ఉన్న రహస్యం ఇదే. అందుకని నిద్రలేమి ఉన్నవారికి డాక్టర్లు కూడా స్లీప్ మాస్క్‌లను ధరించాలని చెబుతుంటారు. ఈ మాస్క్‌లు మనకు ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్నాయి.
మన అభిరుచులకు అనుగుణంగా రకరకాల స్లీప్ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మనకు నచ్చిన మాస్క్‌లను కొనుగోలు చేసి ధరించవచ్చు. ఇక కొన్ని స్లీప్ మాస్క్‌లకు ఇయర్ ప్లస్ లు ఉంటాయి. వాటిని పెట్టుకుంటే శబ్దాలు కూడా వినిపించవు. నిద్ర చక్కగా పడుతుంది. స్లీప్ మాస్కులు మనకు రూ.135 నుంచి రూ.400 మధ్య లభిస్తున్నాయి. వాటికి వాడే మెటీరియల్‌కు అనుగుణంగా ఈ మాస్క్‌ల ధరలు ఉంటాయి.