Boiled Egg Fry : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను ఇలా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Boiled Egg Fry : ఉడికించిన కోడిగుడ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని నేరుగా తీసుకోవ‌డంతో పాటు ఉడికించిన కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా ఉడికించిన కోడిగుడ్ల‌తో మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో కోడిగుడ్డు ఫ్రై కూడా ఒక‌టి. కింద చెప్పిన విధంగా చేసే ఈ కోడిగుడ్డు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కోడిగుడ్లు ఉంటే చాలు ఈ ఫ్రైను చిటికెలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఉడికించిన కోడిగుడ్ల‌తో రుచిగా ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడిగుడ్డు ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 5( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్ లేదా త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, పొడ‌వుగా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Boiled Egg Fry recipe in telugu very tasty food
Boiled Egg Fry

కోడిగుడ్డు ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా కోడిగుడ్ల‌ను మ‌నం మ‌న‌కు న‌చ్చిన విధంగా ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉల్లిపాయ ముక్క‌లను పూర్తిగా వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ట్ చేసుకున్న కోడిగుడ్లు వేసి నెమ్మ‌దిగా క‌ల‌పాలి. త‌రువాత ప‌చ్చిమిర్చిని వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి చిన్న మంట‌పై 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా కోడిగుడ్డు ఫ్రైను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts