Eye Sight : పాలలో ఇవి క‌లిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు..

Eye Sight : నేటి త‌రుణంలో క‌ళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. ప్ర‌తి ప‌ది మందిలో ముగ్గురు క‌ళ్లద్దాల‌ను పెట్టుకుంటున్నార‌ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. సెల్ ఫోన్, కంప్యూట‌ర్ ల వాడ‌కం ఎక్కువ‌వడం, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల‌ వ‌ల్ల ఈ కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంటికి సంబంధించిన‌ స‌మ‌స్య‌లు రావ‌డానికి గ‌ల కార‌ణాలు మ‌న‌కు తెలిసిన‌ప్ప‌టికి ఏమి చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పిల్ల‌లు కూడా కంటి చూపు మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం మ‌న‌ల్ని మ‌రింత క‌ల‌వ‌రానికి గురి చేస్తుంది. పూర్వకాలంలో వ‌య‌సు పై బ‌డిన వారు మాత్ర‌మే క‌ళ్ల‌ద్దాల‌ను ఉప‌యోగించే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న పిల్ల‌లు కూడా క‌ళ్ల‌ద్దాల‌ను ఉప‌యోగిస్తున్నారు.

పూర్వ‌కాలంలో స‌రైన పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకునే వారు. దీంతో వారి వ‌య‌సు పైబ‌డిన కూడా క‌ళ్లు చ‌క్క‌గా కన‌బ‌డేవి. విట‌మిన్ల లోపం కూడా ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఒక ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా మ‌న కంటి చూపును పెంచుకోవ‌చ్చు. క‌ళ్ల‌ద్దాలు అలాగే లేస‌ర్ ట్రీట్ మెంట్ లు చేయించుకునే ప‌ని లేకుండా మ‌నం మ‌న కంటి చూపును చాలా సుభంగా పెంచుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల కొన్ని రోజుల్లోనే మ‌నం కంటిచూపును స‌హ‌జంగా పెంచుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం నాన‌బెట్టిన బాదం ప‌ప్పును, మిరియాల‌ను, ప‌టిక బెల్లాన్ని, ఒక గ్లాస్ పాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా 4 నానబెట్టిన బాదంప‌ప్పుల‌ను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసి వేయాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.

take almonds with warm milk at night to increase Eye Sight
Eye Sight

ఇందులోనే 4 మిరియాల‌ను, ఒక టీ స్పూన్ ప‌టిక బెల్లాన్ని వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని పాల‌ల్లో వేసి 5 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. ఇలా త‌యారు చేసుకున్న పాల‌ను రోజూ రాత్రి ప‌డుకునే ముందు గోరు వెచ్చ‌గా తీసుకోవాలి. ఈ విధంగా పాల‌ను ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కొద్ది రోజుల్లోనే మ‌నం మ‌న కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు. పిల్ల‌ల‌కు కూడా ఈ పాల‌ను ప్ర‌తిరోజూ ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో కూడా కంటి చూపు మెరుగుప‌డుతుంది. ఈ పాల‌ను తాగ‌డంతో పాటు మున‌గాకును కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. మున‌గాకుల్లో కూడా విట‌మిన్ ఎ, క్యాల్షియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. మున‌గాకును తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా అవ్వ‌డంతో పాటు నేత్ర సంబంధిత స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

రోజూ ఒక టీ స్పూన్ మున‌గాకు రసానికి ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కంటి సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే విట‌మిన్ సి అధికంగా ఉండే పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌ళ్ల మంట‌లు, క‌ళ్లల్లో దుర‌ద‌లు వంటి ఇత‌ర కంటి స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. అలాగే పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే కంటికి సంబంధించిన వ్యాయామాలు చేస్తూ త‌గినంత విశ్రాంతి తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డ‌డంతో పాటు ఇత‌ర కంటి సంబంధిత స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

Share
D

Recent Posts