ఆరోగ్యం

బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడ‌క‌బెట్టిన‌ కోడిగుడ్ల‌ను తినాలి.. ఎందుకో తెలుసా ?

రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. రోజంతా ప‌నిచేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు లభిస్తాయి. అయితే బ్రేక్‌ఫాస్ట్ విష‌యానికి వ‌స్తే.. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో కోడిగుడ్లు ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

take boiled eggs in breakfast know why

1. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లో ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే గుండె జబ్బులు, ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే గుడ్ల‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వాటిని తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. అలాగే ఆర్థ‌రైటిస్ నొప్పులు త‌గ్గుతాయి. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

3. ఉడికించిన గుడ్లు బ‌రువును తగ్గించడంలో సహాయపడతాయి. కోడిగుడ్ల‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే ఎక్కువ గంటల పాటు ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా త‌క్కువ ఆహారం తీసుకుంటాం. ఇది బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది.

4. రోగనిరోధక శక్తిని పెంచ‌డానికి శరీరానికి జింక్, ప్రోటీన్లు, సెలీనియం అవసరం. గుడ్డు ఈ పోషకాలను కలిగి ఉంటుంది. అందువ‌ల్ల రోజుకు ఒక గుడ్డును తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శ‌క్తి ల‌భిస్తుంది. గుడ్ల‌లోని ప్రోటీన్లు కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

5. గుడ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్‌లైన లుటిన్, జియాక్సంతిన్ లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి క‌ళ్ల‌ను ర‌క్షిస్తాయి.

6. జంక్ ఫుడ్స్ లేదా అధికంగా ఆహారం తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. గుడ్ల‌ను అల్పాహారంగా తీసుకుంటే కడుపు ఉబ్బరాన్ని నివారించవచ్చు. ఇది తేలికపాటి అనుభూతిని ఇస్తుంది. జీర్ణాశ‌యం లైట్‌గా ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది.

7. ఉడికించిన గుడ్లలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరం ప్రోటీన్‌ను సులభంగా గ్రహించడంలో సహాయపడతాయి. జీవక్రియ, మెదడు పనితీరును మెరుగు ప‌రుస్తాయి. కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువ‌ల్ల బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తింటే మంచిది.

Admin

Recent Posts