Gas Trouble : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భోజనం చేయడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఆలస్యంగా మేల్కొనడం, అధిక బరువు, మాంసం, కారం, మసాలాలను అధికంగా తినడం, ఒత్తిడి.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తోంది. అయితే రోజుకు కేవలం రెండు గ్లాసుల మజ్జిగను తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య మొత్తం పోతుంది. దెబ్బకు గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది.
దేశవాళీ ఆవు పెరుగు నుంచి మీగడను తీయాలి. అనంతరం ఆ పెరుగుతో చాలా పలుచని మజ్జిగను తయారు చేయాలి. ఆ మజ్జిగతో కాస్త శొంఠి పొడి కలపాలి. దీన్ని మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం సేవించాలి. అంతే.. దెబ్బకు గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. కడుపులో మంట అనేది ఉండదు. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
అయితే రోజుకు రెండు గ్లాసులు అని ఏమీ నియమం లేదు. మజ్జిగను 5 గ్లాసుల వరకు కూడా తాగవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. శరీరానికి ప్రొ బయోటిక్స్ బాగా లభిస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఇక ఈ విధంగా మజ్జిగను తయారు చేసుకుని చల్లగా తాగడం వల్ల ఈ సీజన్‌లో వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. దీంతో ఎండ దెబ్బ బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు.