Curry Leaves Benefits : కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం సాధారణంగా కరివేపాకుని వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. కరివేపాకుని తరచూ తీసుకుంటే, శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. చాలా సమస్యలు కంట్రోల్ లో ఉంటాయి. కరివేపాకుని వాడడం వలన, వంటకి మంచి రుచి మాత్రమే కాదు. సువాసన కూడా వస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు కూడా కరివేపాకు తో పొందవచ్చు. ముఖ్యంగా, పలు రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కరివేపాకుని తీసుకోవడం వలన, రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.
కరివేపాకులో పొటాషియం కూడా ఉంటుంది. అధిక రక్తపోటుని కంట్రోల్ చేయడానికి, ఇది బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకుతో ఉబకాయం సమస్య కూడా తగ్గుతుంది. ఉబకాయంతో బాధపడేవాళ్లు, కరివేపాకుని తీసుకుంటే, ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కరివేపాకు ని నమిలి, రసాన్ని మింగేయాలి. ఆపై అరగంట పాటు వ్యాయామం చేస్తే మంచిది. శరీర బరువు తగ్గుతారు. ఊబకాయం సమస్య నుండి బయట పడొచ్చు.
షుగర్ సమస్యతో బాధ పడే వాళ్ళు, కరివేపాకుని తీసుకోవడం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి, కరివేపాకు బాగా ఉపయోగ పడుతుంది. కరివేపాకుని తీసుకుంటే, గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. కరివేపాకు తో జుట్టు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.
కరివేపాకుని అతిగా తీసుకుంటే కడుపు నొప్పి వస్తుంది. ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, మరీ ఎక్కువగా తీసుకో వద్దు. ఏ ఆహార పదార్థాలను అయినా సరే, లిమిట్ గా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే, పలు సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి. ప్రతి రోజు మూడు లేదా నాలుగు కరివేపాకు ఆకులని నమిలి తింటే, ఈ ప్రయోజనాలన్నిటిని పొంది సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు. మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.