Fennel Seeds : చాలా మంది సోంపుని తీసుకుంటూ ఉంటారు. భోజనం తిన్నాక సోంపు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. సోంపు గింజల వలన లాభాలని పొందవచ్చు. చూశారంటే మీరు కూడా ఈసారి తప్పకుండా తింటారు. సోంపు గింజలు చిన్నగా వున్నా వాటి వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. క్యాల్షియం, మెగ్నీషియంతోపాటు పొటాషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు సోంపులో ఉంటాయి.
సోంపు గింజలను తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. అందుకే చాలామంది భోజనం తిన్న తర్వాత సోంపుని తీసుకుంటూ ఉంటారు. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఉండవు. జీవక్రియని వేగవంతం చేయడానికి సోంపు బాగా ఉపయోగపడుతుంది. క్యాలరీలని వేగంగా ఖర్చు చేసి బరువు తగ్గే అవకాశం కూడా సోంపు ఇస్తుంది. సోంపు తీసుకోవడం వలన నిద్రలేమి సమస్య కూడా ఉండదు.
సోంపుతో మంచి నిద్రని పొందొచ్చు. కాబట్టి ఒత్తిడి కారణంగా లేదంటే ఇతర కారణాల వలన సరైన నిద్రని పొందలేక పోయేవాళ్లు సోంపును తీసుకుంటే మంచి నిద్రని పొందొచ్చు. ఇందులో పొటాషియం ఉండడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. హృదయ స్పందన రేటు అదుపులో ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఒక గ్లాసు నీళ్లలో అర స్పూన్ సోంపు గింజల్ని రాత్రిపూట నానబెట్టుకుని, ఉదయాన్నే నానబెట్టిన సోంపు గింజలను తినేసి, ఆ నీటిని తాగేస్తే ఈ లాభాలు అన్నింటినీ మీరు పొందొచ్చు, మరి ఇక ఈసారి తప్పకుండా సోంపుని రోజూ తీసుకోండి. అప్పుడు ఉదర సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, నిద్రలేమి, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వంటివి తొలగిపోతాయి. అలాగే పోషకాలు కూడా అందుతాయి.