హెల్త్ టిప్స్

Jaggery : బెల్లం, నెయ్యి క‌లిపి ఈ స‌మ‌యంలో తినండి.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Jaggery : బెల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్న విషయం తెలిసిందే. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో బెల్లం సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే బెల్లం తీసుకోవడం వలన అనేక లాభాలున్నాయి. అలాగే నెయ్యి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే నెయ్యి.. బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. మధ్యాహ్న భోజనం తర్వాత నెయ్యి.. బెల్లం కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో భోజనం తర్వాత బెల్లం, నెయ్యి కలిపి తీసుకోకపోతే.. రాత్రిళ్లు తీసుకోవచ్చు.

ఇందుకోసం ఒక స్పూన్ నెయ్యిని తీసుకుని అందులో చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి.. ఐదు నుంచి పది నిమిషాల తర్వాత తినాలి. బెల్లంలో ఐరన్, మెగ్నిషియం, పొటాషియం.. విట‌మిన్స్ బి, సి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. నెయ్యిలో విటమిన్ ఎ, కె, ఇ, డిలతోపాటు.. దేశీ నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. బెల్లం.. నెయ్యి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. చర్మం, జట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడుతాయి. నెయ్యి, బెల్లం కలిపి తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

take jaggery and ghee in this time for many benefits take jaggery and ghee in this time for many benefits

అంతేకాకుండా.. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. అలాగే శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో శ‌రీరం శుభ్రంగా మారుతుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటివి కూడా తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం బెల్లం మరియు నెయ్యి కలిపి తీసుకుంటే మానసిక స్థితిని మెరుగుపరుస్తుందిస్తాయి. అయితే బెల్లం కొనేటప్పుడు ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే మంచిది. ఆర్గానిక్ బెల్లం ముదురు రంగులో ఉంటుంది. అదే కెమికల్స్ కలిపిన బెల్లం అయితే పసుపు రంగులో ఉంటుంది. ఇలా ఈ రెండింటిని క‌లిపి చేసిన మిశ్ర‌మాన్ని రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts