నిమ్మకాయలను తరచూ మనం వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. దీని రసంతో పులిహోర లేదంటే నిమ్మకాయలతో పచ్చడి చేసుకుని తినడం మనకు అలవాటు. ఈ క్రమంలో కొందరు నిమ్మరసాన్ని తలకు చుండ్రు పోయేందుకు కూడా పెట్టుకుంటారు. అయితే నిమ్మతో మనకు తెలిసిన ఉపయోగాలు ఇవే. కానీ నిజానికి నిమ్మ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ నీటిని తాగితే దాంతో మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్యాలు దూరమవుతాయి. శరీరానికి కీలక పోషకాలు లభిస్తాయి. అసలు ఇలా రోజూ నిమ్మ రసాన్ని తాగుతుంటే ఎలాంటి మెడిసిన్ వాడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు కూడా. ఈ క్రమంలో నిమ్మరసం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉండడం వల్ల పల రకాల ఇన్‌ఫెక్షన్లు ఇట్టే నయం అవుతాయి. ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసాన్ని కలిపి రోజూ తాగుతుంటే దాంతో శరీరంలో పొటాషియం లెవల్స్ పెరుగుతాయి. సిట్రేట్ స్థాయిలు కూడా మెరుగు పడతాయి. దీంతో నెమ్మదిగా కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. రోజూ నిమ్మరసాన్ని తాగుతుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా పోతాయి. దీంతో కడుపు నొప్పి బాధించదు. క్రమం తప్పకుండా ఆ నీటిని తాగుతుంటే గాల్ బ్లాడర్ సమస్యలు రావు.
నిత్యం మన తినే ఆహారం, పీల్చే గాలి, తాగేనీరు వంటి వాటి వల్ల మన శరీరంలోకి విష పదార్థాలు వచ్చి చేరుతుంటాయి. ఈ క్రమంలో రోజూ నిమ్మ రసాన్ని తాగుతుంటే దాంతో ఆ వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దాంతో ఎలాంటి రోగాలు దరి చేరవు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల నిమ్మరసం మన చర్మానికి మంచి చేస్తుంది. చర్మం కాంతి వంతంగా మారుతుంది. మృదువుగా తయారవుతుంది. ముడతలు, మచ్చలు ఉండవు. నిత్యం నిమ్మరసాన్ని తాగుతుంటే దాంతో జీర్ణాశయ సంబంధ సమస్యలు రావు. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం వంటివి రావు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధ గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. దీంతో అధిక బరువు ఉన్నవారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇలా తాగడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె సంబంధ సమస్యలు కూడా రావు.
నొప్పులు, వాపులు ఉన్నవారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది బాగా ఉపకరిస్తుంది. అదేవిధంగా ఈ కాలంలో వచ్చే ఫ్లూ జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు పోతాయి. మధుమేహం ఉన్నవారు నిమ్మరసాన్ని తాగుతుంటే దాంతో వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహం అదుపులో ఉంటుంది.