రాత్రి పూట ఆహారంలో వీటిని తీసుకోండి.. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడతాయి..!

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే నిత్యం వ్యాయామం చేస్తుంటారు. అయితే అధిక బరువు తగ్గాలంటే వ్యాయామం ఎంత అవసరమో, సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే అవసరం. కింద తెలిపిన ఆహారాలను రాత్రి పూట తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. రోజూ వీటిని తీసుకుంటే కేవలం ఒక్క వారంలోనే చెప్పుకోదగిన మార్పు వస్తుంది. తరువాత బరువు తగ్గేవరకు వీటిని రోజూ తీసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…

take these at night for weight loss

1. చెర్రీలు

చెర్రీ పండ్లను రాత్రి పూట తినాలి. దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తీసుకుంటారు. క్యాలరీలు తక్కువగా అందుతాయి. ఫలితంగా శరీరం తన జీవక్రియల కోసం కొవ్వును ఖర్చు చేస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. చెర్రీలను తినడం ద్వారా మెలటోనిన్‌ మనకు సహజసిద్ధంగా లభిస్తుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది. అందువల్ల నిద్ర చక్కగా వస్తుంది. నిద్రలేమి సమస్య పరిష్కారమవుతుంది.

2. ఉడకబెట్టిన కోడిగుడ్లు

రాత్రి పూట ఉడకబెట్టిన కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గవచ్చు. వీటిని తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. రాత్రి పూట మన శరీరం కండరాలకు మరమ్మత్తులు చేసుకుంటుంది. ఈ క్రమంలో గుడ్లలో ఉండే ప్రోటీన్లు అందుకు ఉపయోగపడతాయి. కనుక రోజూ రాత్రి ఉడకబెట్టిన కోడిగుడ్లను తినడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.

3. బాదంపప్పు

రాత్రిపూట బాదం పప్పును తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫైబర్‌ ఆకలిని తగ్గిస్తుంది. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బాదంపప్పులో ఉండే ప్రోటీన్లు రాత్రి పూట కండరాల మరమ్మత్తులకు ఉపయోగపడతాయి. రాత్రి పూట బాదంపప్పును తినడం వల్ల బరువు తగ్గుతారని సైంటిస్టులు పరిశోధనల్లో వెల్లడైంది. కనుక వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చు.

Share
Admin

Recent Posts